Share News

Viral Video: రూల్స్ పాటించకపోతే అలాగే ఉంటుంది.. సింహం ఏం చేసిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్!

ABN , Publish Date - Sep 02 , 2024 | 02:15 PM

జంతు ప్రదర్శన శాలలో బోనుల వెనుక బంధించి ఉన్న జంతువులతో కొందరు అతిగా ప్రవర్తిస్తుంటారు. వాటి స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రవర్తిస్తుంటారు. జూ నిబంధనలను ఉల్లంఘిస్తూ జంతువులతో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం వంటి చిరాకు పుట్టించే పనులు చేస్తుంటారు.

Viral Video: రూల్స్ పాటించకపోతే అలాగే ఉంటుంది.. సింహం ఏం చేసిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్!
A Lion's Response to Rule- Breaking

జంతు ప్రదర్శనశాలలో (Zoo) బోనుల వెనుక బంధించి ఉన్న జంతువులతో కొందరు అతిగా ప్రవర్తిస్తుంటారు. వాటి స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రవర్తిస్తుంటారు. జూ నిబంధనలను (Rules) ఉల్లంఘిస్తూ జంతువులతో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం వంటి చిరాకు పుట్టించే పనులు చేస్తుంటారు. జంతువులను, ఇతర పర్యాటకులను కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అలాంటి వారు ఒక్కోసారి జంతువుల ఆగ్రహానికి గురవుతుంటారు. తీవ్ర ప్రమాదాల బారిన పడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ సింహం (Lion) ప్రవర్తన మాత్రం షాకింగ్‌గా ఉంది. (Viral Video)


@visualfeastwang అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఓ జూలో చిత్రీకరించారు. ఓ యువకుడు సింహానికి ఏదో తినిపిస్తుండగా, మరో యువకుడు ఎన్‌క్లోజర్‌లో చేయి పెట్టి తన మొబైల్‌తో వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. యువకుడు అందించిన ఆహారం తిన్న సింహానికి మరో యువకుడు చేస్తున్న పని చిరాకు తెప్పించింది. అయితే సింహం తనదైన ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా సున్నితంగా హెచ్చరించింది. ఎన్‌క్లోజర్‌లో చేయి పెట్టి వీడియో తీస్తున్న యువకుడి దగ్గరకు వెళ్లింది. తన కాలితో ఆ యువకుడి చేతిని బలవంతంగా బయటకు తోసేసింది. అంతే ఆ యువకుడిపై దాడికి దిగలేదు.


అలా రూల్స్ అతిక్రమించి వీడియో తీయడం తప్పు అని సూచించినట్టుగా తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించింది. ఆ యువకుడు చేతులు తీయగానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను కొద్ది గంటల్లోనే 20 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``మనిషికి లేని వివేకం క్రూర జంతువుకు ఉంది``, ``ఆ సింహం చాలా దయగలది``, ``ఆ కుర్రాడికి ధైర్యం ఎక్కువ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Brain Teaser: కేవలం 1 శాతం మందే సరైన జవాబు చెప్పారు.. ఈ ఫొటోలోని వ్యక్తుల్లో ఎవరు సేఫ్..!


Viral Video: రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.. ఓ ట్రక్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..


Picture Puzzle: ఈ పజిల్‌లో ``Hero``ను కనిపెడితే మీరు నిజమైన హీరోనే.. 5 సెకెన్లలో పూర్తి చేయండి!


Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదీ.. కదులుతున్న లారీ వెనుక ఊయల కట్టుకుని ఎలా ఊగుతున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2024 | 04:49 PM