Viral Video: భారత్‌లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు.. చిప్స్ ఎలా తయారు చేస్తున్నాడో చూడండి.. నెటిజన్ల కామెంట్స్ ఏంటంటే..
ABN , Publish Date - Mar 23 , 2024 | 05:32 PM
ఇండియాలో స్నాక్స్ తయారీదారులు శుభ్రత పాటించరని కామెంట్లు చేస్తుంటారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఓ వ్యక్తి ఆలూ చిప్స్ చేస్తున్న వీడియో హల్‌చల్ చేస్తోంది.
రోడ్డు పక్కన స్టాల్స్‌లో, చిన్న చిన్న హోటల్స్‌లో తయారయ్యే ఆహారం పట్ల కొందరికి చెడు అభిప్రాయం ఉంటుంది. వాళ్లు శుభ్రత పాటించరని, మంచి ఆయిల్, ఆహార పదార్థాలు ఉపయోగించరని అనుకుంటుంటారు. ఇండియాలో స్నాక్స్ తయారీదారులు శుభ్రత పాటించరని కామెంట్లు చేస్తుంటారు. అలాంటి ఎన్నో వీడియోలు (Cooking Videos) సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఓ వ్యక్తి ఆలూ చిప్స్ (Chips) చేస్తున్న వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వ్యక్తి చిప్స్ తయారు చేస్తున్న విధానం మాత్రం అందరినీ మెప్పిస్తోంది (Chips making Video).
rajiv_choudhary అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి బంగాళాదుంపలతో చిప్స్ తయారు చేస్తున్నాడు. ముందుగా ఆ వ్యక్తి బంగాళాదుంపలను క్లీనింగ్ మెషిన్‌లో వేసి నీరు పోశాడు. అందులో బాగా క్లీన్ అయిన తర్వాత చిప్స్ వేయడం ప్రారంభించాడు. అతను ఉపయోగిస్తున్న నూనె కూడా స్వచ్ఛంగా ఉంది. అలాగే అతడు తయారు చేసేటపుడు గ్లౌస్ కూడా ధరించాడు. ఆ చిప్స్‌కు కారం, ఉప్పు తగు పాళ్లలో జోడించాడు.
Shocking Video: చిరుత కంట పడితే మామూలుగా ఉండదు.. కోతిని ఎలా వేటాడిందో చూడండి..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 1.4 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చాలా నీట్‌గా తయారు చేస్తున్నాడు``, ``అతడు ఉపయోగిస్తున్న ఆయిల్ బాగుంది``, ``భారత్‌లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు``, ``ఇలా కష్టపడే వాళ్లకు తగిన ఫలితం ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.