Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం.. ప్లేట్‌లో వడ్డించిన చేప ఎలా నడిచిందో చూడండి..
ABN , Publish Date - Nov 12 , 2024 | 08:43 AM
మీరు ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లి నాన్-వెజ్ డిష్ ఆర్డర్ ఇచ్చారు. వెయిటర్ మీకు ప్లేట్‌లో చక్కగా డెకరేట్ చేసిన చేప లేదా పీతలు వడ్డించాడు. మీరు తినడానికి రెడీ అవుతుండా ఆ ప్లేట్‌లోని చేప లేచి నడుస్తుంటే ఎలా ఉంటుంది. షాక్‌తో మాట బయటకు రాదు కదా..
ఒక్కసారి ఊహించుకోండి.. మీరు ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లి నాన్-వెజ్ డిష్ (Non-veg Dish) ఆర్డర్ ఇచ్చారు. వెయిటర్ మీకు ప్లేట్‌లో చక్కగా డెకరేట్ చేసిన చేప లేదా పీతలు వడ్డించాడు. మీరు తినడానికి రెడీ అవుతుండగా ఆ ప్లేట్‌లోని చేప లేచి నడుస్తుంటే ఎలా ఉంటుంది. షాక్‌తో మాట బయటకు రాదు కదా.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసినా అదే అనుభూతి కలుగుతుంది. ప్లేట్‌లో వడ్డించిన సూషీ చేప (Sushi fish) లేచి భయంకరంగా చూస్తూ నడుచుకుని వెళ్లిపోయింది. ఆ వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం (Viral Video).
tarek.em అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ప్రముఖ జపాన్ డిష్ అయిన సూషీ ఫిష్ ఓ రెస్టారెంట్ టేబుల్‌పై ప్లేట్‌లో అందంగా అలంకరించి ఉంది. హఠాత్తుగా ఆ చేప లేచి నిల్చుని భయకరంగా చూస్తూ నడవడం మొదలు పెట్టింది. ఒక ప్లేట్‌లో నుంచి మరో ప్లేట్‌లోకి దూకేసింది. ఆ వీడియో చూసిన వారు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. అయితే ఇది నిజమైనా వీడియోనా? లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా రూపొందించిన వీడియోనా అనేది చాలా మందికి అనుమానంగా ఉంది. అది ఏఐ వీడియోనే అయినప్పటికీ పూర్తిగా చాలా నేచురల్‌గా ఉంది.
ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 10 కోట్ల మందికి పైగా వీక్షించారు. 14 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది నిజమా``, ``హింస ఇలాగే కొనసాగితే మీ ప్లేట్‌లోని జంతువులు ఇలాగే చేస్తాయి``, ``ఇది ఏఐ వీడియోనే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Shocking: డ్రైవర్ చేసిన చిన్న తప్పు.. భారీ మూల్యం చెల్లించిన ఓనర్.. ఒడిశాలో ఏం జరిగిందో తెలిస్తే..
Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. తక్కువ ఖర్చుతో రూమ్ హీటర్ ఎలా తయారు చేశాడంటే..
IQ Test: ఈ నలుగురిలో ప్రమాదంలో ఉన్నది ఎవరు?.. 5 సెకెన్లలో గుర్తించి హెచ్చరించండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.