Share News

Viral Video: తమ్ముడు తెలివైనవాడు.. పెళ్లికి ముందే అసలు విషయం తెలుసుకున్నాడు.. పోస్ట‌ర్‌పై వధువు పేరు చూస్తే..

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:51 PM

పెళ్లి అనేది తమ జీవితంలో అత్యంత ప్రత్యేకంగా ఉండిపోవాలని చాలా మంది కోరుకుంటారు. పెళ్లికి సంబంధించిన ప్రతీదీ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు. పెళ్లి దుస్తుల దగ్గర్నుంచి, కల్యాణ మండపం వరకు అన్నీ తమకు నచ్చేలా ఉండాలనుకుంటారు. అయితే అప్పుడప్పుడు అనుకోని తప్పులు దొర్లుతుంటాయి.

Viral Video: తమ్ముడు తెలివైనవాడు.. పెళ్లికి ముందే అసలు విషయం తెలుసుకున్నాడు.. పోస్ట‌ర్‌పై వధువు పేరు చూస్తే..
Bride`s Name

పెళ్లి (Wedding) అనేది తమ జీవితంలో అత్యంత ప్రత్యేకంగా ఉండిపోవాలని చాలా మంది కోరుకుంటారు. పెళ్లికి సంబంధించిన ప్రతీదీ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు. పెళ్లి దుస్తుల దగ్గర్నుంచి, కల్యాణ మండపం వరకు అన్నీ తమకు నచ్చేలా ఉండాలనుకుంటారు. అయితే అప్పుడప్పుడు అనుకోని తప్పులు దొర్లుతుంటాయి. అవి ఇతరులకు విపరీతంగా నవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే (Viral Video).


సాధారణంగా కల్యాణ మండపానికి వెళ్లే వాహనాలపై వధూవరులు పేర్లు ఉన్న స్టిక్కర్లు అంటిస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అలాంటిదే ఓ పెళ్లి కారు (Wedding Car) రోడ్డుపై వెళుతోంది. ఆ కారుపై వధూవరుల పేర్లు ఉన్నాయి. అయితే ఆ కారుపై ఉన్న స్టిక్కర్‌పై ``అనిల్ వెడ్స్ సమస్య`` అని రాసి ఉంది. నిజానికి వధువు పేరు (Bride`s Name) సమర్య. అయితే కావాలని రాయించారో, అనుకోకుండా తప్పు దొర్లిందో కానీ, చూసిన వారికి మాత్రం చాలా నవ్వు తెప్పిస్తోంది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అనిల్‌కు చాలా క్లారిటీ ఉంది``, ``పెళ్లికి ముందే అసలు విషయం తెలుసుకున్నాడు``, ``పెళ్లి తర్వాత వరుడికి దెబ్బలు ఖాయం``, ``బెస్ట్ ఆఫ్ లక్ అనిల్ భయ్యా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని ఆరు ఆంగ్ల పదాలను కనిపెట్టండి!


Shocking Video: వామ్మో.. అంత అహంకారమా? కారును అడ్డుకున్న పోలీసులపై పాక్ మహిళ తీవ్ర ఆగ్రహం.. ఏం చేసిందో చూస్తే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 26 , 2024 | 04:52 PM