Viral Video: వీళ్ల తెలివి తెల్లారినట్టే ఉంది.. సులభమైన పని కోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి..
ABN , Publish Date - Dec 06 , 2024 | 10:23 PM
మనదేశంలో తెలివి తక్కువగా వ్యవహరించే వాళ్లు కూడా ఉన్నారు. సులభంగా జరిగిపోయే పనికి ఎక్కువగా కష్టపడిపోతుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు నవ్వుకుంటున్నారు.
మన దేశంలో తెలివైన వాళ్లకు కొదవ లేదు. కష్టమైన పనిని సులభంగా పూర్తి చేసేందుకు చాలా మంది తమ బ్రెయిన్‌ను వాడతారు. కష్టమైన సమస్యకు సులభమైన పరిష్కారం కనుగొంటారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దానికి భిన్నంగా తెలివి తక్కువగా వ్యవహరించే వాళ్లు కూడా ఉన్నారు. సులభంగా జరిగిపోయే పనికి ఎక్కువగా కష్టపడిపోతుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. @JATtilok అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో నలుగురు కార్మికులు బస్తాలను ట్రక్కులో లోడ్ చేస్తున్నారు. నలుగురు ట్రక్ ఎక్కి బస్తాలను ఒకదాని మీద ఒకటి వరుసలో పెడుతున్నారు. అయితే పక్కనే పెట్టాల్సిన బస్తాలను ఇద్దరు కలిసి పైకి ఎత్తి మరొక వ్యక్తి తలపై పెడుతున్నారు. ఆ వ్యక్తి తన తలపై ఉన్న బస్తాను మళ్లీ పక్కనే వేస్తున్నాడు. వేరే వ్యక్తి పైన కూర్చుని వాళ్లు చేసే పనిని చూస్తున్నాడు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి.. ``ప్రపంచంలో అత్యంత తెలివైన నలుగురు వ్యక్తులు`` అని క్యాప్షన్ ఇచ్చాడు. వారి పని తీరును ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.85 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``వీళ్ల తెలివి అద్భుతంగా ఉంది``, ``వారు అలా చేయడం వెనుక ఏదైనా కారణం ఉందేమో``, ``బస్తాలను వరుసగా పేర్చడానికి వాళ్లు అలా చేస్తున్నట్టున్నారు``, ``ఇదెక్కడి పనితనం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లు మామూలు కిలేడీలు కారు.. షాప్‌లో ఎలా చోరీ చేశారో చూడండి.. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే..
Viral Video: ముసలోడే కానీ, మహానుభావుడు.. పోటీలో కుర్రాడిని ఎలా బోల్తా కొట్టించాడో చూడండి..
Viral Video: వామ్మో.. కుక్కను మింగేసి కదల్లేకపోతున్న భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..
Viral News: అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్.. వియత్నాంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం ఏంటంటే..
Viral Video: ఈ కుక్కకు ఏమైంది.. పెళ్లి మండపంలో వధువుకు చుక్కలు చూపించిన పెట్ డాగ్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి