Share News

Viral Video: అదృష్టం అంటే ఇతడిదే.. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఎలా బయటపడ్డాడో చూడండి..

ABN , Publish Date - Dec 17 , 2024 | 03:43 PM

అదృష్టవంతులు సముద్రం మధ్యలో పడినా ఎలాగోలా ఈదుకుంటూ బయటకు వచ్చేస్తారని అంటుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే అదృష్టం అంటే ఏంటో అర్థమవుతుంది. ఓ బైకర్ అతి వేగంగా వస్తూ ఓ కారును ఢీకొట్టాడు.

Viral Video: అదృష్టం అంటే ఇతడిదే.. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఎలా బయటపడ్డాడో చూడండి..
Bike accident

అదృష్టం (Luck) ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా సులభంగా బయటపడవచ్చు. అదృష్టవంతులు సముద్రం మధ్యలో పడినా ఎలాగోలా ఈదుకుంటూ బయటకు వచ్చేస్తారని అంటుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే అదృష్టం అంటే ఏంటో అర్థమవుతుంది. ఓ బైకర్ (Biker) అతి వేగంగా వస్తూ ఓ కారును ఢీకొట్టాడు (Bike Accident). అయినా అతడికి చిన్న దెబ్బ కూడా తగ్గలేదు. ఆ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


@introvert_hu_ji అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఖాళీగా ఉన్న ఓ రోడ్డు మీద వాహనాలు అతి వేగంగా వెళ్లిపోతున్నాయి. ఒక కారు రోడ్డుకు అటు వైపు నుంచి కుడి వైపునకు తిరుగుతోంది. ఆ సమయంలో ఓ బైకర్ ఆ రూట్‌లో అతి వేగంగా వస్తున్నాడు. నేరుగా ఆ వచ్చి ఆ కారును ఢీకొట్టాడు. ఎగిరి ఆ కారు బానెట్ మీద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ అతడికి ఎలాంటి గాయాలూ కాలేదు. అతడు బైక్ మీద వేగంగానే వస్తున్నప్పటికీ కారు ఆగి ఉండడం వల్ల అతడు బతికి బయటపడ్డాడు. ఆ వీడియో అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 18 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 2 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అతడిని దేవుడే కాపాడాడు``, ``యమధర్మ రాజు ఆ సమయంలో లీవ్‌లో ఉన్నట్టున్నాడు``, ``అదృష్టవంతుడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture puzzle Test: మీ బ్రెయిన్ షార్ప్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలో తప్పేంటో వెతికి పట్టుకోండి..


Viral Video: కొండచిలువతో అటలాడితే అలాగే ఉంటుంది.. ఆ వ్యక్తి పరిస్థితి ఏం జరిగిందో చూడండి..


Viral Video: పెళ్లి వేదికపై బావతో మరదలి సరసాలు.. వధువు పరిస్థితి చూస్తే నవ్వు రాక తప్పదు..


Shocking: వందల కోట్ల లాటరీ గెలిచాడు.. జీవితం మారిపోతుందనుకున్నాడు.. కొన్ని రోజులకే ఊహించని సీన్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 17 , 2024 | 03:43 PM