Share News

Viral Video: ఇది ఆల్టో కాదు.. మినీ థార్.. ఓ వ్యక్తి ఇంజినీరింగ్ ప్రతిభ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ABN , Publish Date - Dec 25 , 2024 | 03:30 PM

చాలా మంది మధ్య తరగతి ప్రజలు ఆల్టో కారును కొనేందుకు మక్కువ చూపుతుంటారు. ఇక, ఇటీవలి కాలంలో విడుదలై చాలా మందిని ఆకట్టుకుంటున్న కారు థార్. అటు స్పోర్ట్ లుక్‌తోనూ, ఇటు భారీగానూ ఉండే ఈ కారు ఖరీదు కాస్త ఎక్కువే.

Viral Video: ఇది ఆల్టో కాదు.. మినీ థార్.. ఓ వ్యక్తి ఇంజినీరింగ్ ప్రతిభ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Alto was converted into Mini Thar

మనదేశంలో అత్యధిక మంది ఉపయోగించే కారు ఆల్టో (Alto Car). ఈ కారు ధర తక్కువలో ఉండడం, మైలేజ్ కూడా ఎక్కువ కావడంతో చాలా మంది మధ్య తరగతి ప్రజలు ఆల్టో కారును కొనేందుకు మక్కువ చూపుతుంటారు. ఇక, ఇటీవలి కాలంలో విడుదలై చాలా మందిని ఆకట్టుకుంటున్న కారు థార్ (Thar). అటు స్పోర్ట్ లుక్‌తోనూ, ఇటు భారీగానూ ఉండే ఈ కారు ఖరీదు కాస్త ఎక్కువే. తాజాగా ఓ వ్యక్తి సాధారణ ఆల్టో కారుకు థార్ లుక్ ఇచ్చి చాలా మందిని ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


anilrajput9426 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డుపై మారుతి 800 కారు రోడ్డుపై కదులుతోంది. కానీ వేరే రకం కారు రోడ్డుపై వెళ్తున్నట్లు అనిపిస్తుంది. దానికి కారణం ఆ కారుకు థార్ చక్రాలను అమర్చారు. దీంతో ఆల్టో కారు రూపమే మారిపోయింది. భారీ చక్రాలపై ఆల్టో వెళ్తుంటే వెరైటీగా కనిపిస్తోంది. కారు బాడీ మారుతీది, టైర్లు థార్‌వి. వాహనం పైన ఉన్న ప్లేట్‌పై ``థార్ మినీ 4x4`` అని రాసి ఉంది. కారుపై గుజరాత్ నంబర్ ప్లేట్ కనిపిస్తోంది. ఆ కారును అదే రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియోకు ``థార్ కారు కొత్త వేరియంట్`` అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 25 లక్షల మంది వీక్షించారు. 2.4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``థార్‌కు ఘోర అవమానం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle Test: ఈ ఫొటోలో తప్పేంటో 5 సెకెన్లలో కనిపెడితే.. మీ అబ్జర్వేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Viral Video: ఇది మామూలు ప్రాంక్ కాదు.. స్నేహితుడిని నమ్మినందుకు ఎలా మోసం చేశాడో చూడండి..


Viral Video: పల్లీలు అమ్ముకునే ఈ బాలిక ముందు గ్రాడ్యుయేట్లు కూడా దిగదుడుపే.. పాక్ బాలిక ఇంగ్లీష్ వినండి..


Viral Video: ఓహో.. అందుకే చలి ఇంతలా పెరుగుతోందా? అంకుల్ చేసిన పనిపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 25 , 2024 | 03:30 PM