Viral Video: వామ్మో.. హార్ట్ ఎటాక్ రప్పించిన ఏనుగు.. రోడ్డ మీద నడుస్తూ ఆకస్మాత్తుగా ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:06 PM
ఆహారం దొరక్క, ఆవాసం లేక వన్య ప్రాణులు సమస్యల పాలవుతున్నాయి. ఈ క్రమంలో ఆహారం కోసం జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. మనుషులపై దాడి చేస్తున్నాయి లేదా అవే దాడికి గురవుతున్నాయి. ఎంతో శాంతంగా ఉండే ఏనుగులు కూడా తీవ్ర ఆగ్రహంగా ప్రవర్తిస్తున్నాయి.
అభివృద్ధి పేరుతో చెట్లు నరికేయడం, అడవులు (Forest) కొట్టేసి వాటి మధ్య నుంచి రోడ్లు వేసేయడం వల్ల వన్య ప్రాణాలు (Wild Animals) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆహారం దొరక్క, ఆవాసం లేక సమస్యల పాలవుతున్నాయి. ఈ క్రమంలో ఆహారం కోసం జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. మనుషులపై దాడి చేస్తున్నాయి లేదా అవే దాడికి గురవుతున్నాయి. ఎంతో శాంతంగా ఉండే ఏనుగులు (Elephant) కూడా తీవ్ర ఆగ్రహంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. ఆ వీడియోలో ఏనుగు ప్రవర్తన అపరిచితుడిని తలపించింది (Viral Video).
@nirmohi_hu అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రాత్రి సమయంలో కొందరు కారులో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారు. వారికి రోడ్డు పక్కగా ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న ఏనుగు కనబడింది. దాంతో వారు కారును స్లో చేశారు. కారులోని వ్యక్తి గ్లాస్ దించి చేయి బయట పెట్టి ఏనుగును పిలిచాడు. భయంతోనో, ఆగ్రహంతోనో ఆ ఏనుగు విచిత్రంగా రియాక్ట్ అయింది. తీవ్ర ఆగ్రహంతో ఘీంకరిస్తూ కారు వైపు దూసుకెళ్లింది. భయపడిన ఆ ప్రయాణికులు ముందుకు వెళ్లిపోయారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 7.8 లక్షల మంది వీక్షించారు. 4 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``లైవ్‌లో చూస్తే హార్ట్ ఎటాక్ గ్యారెంటీ``, ``వన్య ప్రాణులతో ఆటలాడుకుంటున్నాం``, ``నేను నిజంగా భయపడ్డాను``, ``వన్య ప్రాణాలుకు స్వేచ్ఛ, ఆకలి, ఆవాసం లేకుండా చేస్తే అవి ఇలాగే ప్రవర్తిస్తాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీ కళ్లకు సవాల్.. ఈ అడవిలో కప్ప ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..
Viral Video: మీరూ ఇలాంటి తప్పు చేయకండి.. ఆ కార్ డ్రైవర్ చేసిన పనికి ఏకంగా రూ.2.5 లక్షల జరిమానా..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి