Viral Video: పానీపూరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. ఏనుగు ఎలా లొట్టలేసుకుంటూ తింటోందో చూడండి..
ABN , Publish Date - Nov 27 , 2024 | 02:58 PM
మనదేశంలో ప్రతి చిన్న టౌన్‌లో కూడా పానీపూరీ బళ్లు అనేకం కనిపిస్తుంటాయి. అంతలా అందరినీ పానీపూరీ ఆకట్టుకుంటోంది. పానీపూరీ టేస్ట్‌కు మనుషులే కాదు.. జంతువులు కూడా ఫిదా అవుతున్నాయి. ఓ ఏనుగు లొట్టలేసుకుంటూ పానీపూరీ తింటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పానీపూరీ (PaniPuri) లేదా గోల్‌గప్పా.. పేరు ఏదైనా దానిని అందరూ ఇష్టపడతారు. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరూ పానీపూరీ తినేందుకు ఉబలాటపడతారు. రోడ్డు పక్కన స్టాల్స్ ముందు క్యూ కడతారు. మనదేశంలో ప్రతి చిన్న టౌన్‌లో కూడా పానీపూరీ బళ్లు అనేకం కనిపిస్తుంటాయి. అంతలా అందరినీ పానీపూరీ ఆకట్టుకుంటోంది. పానీపూరీ టేస్ట్‌కు మనుషులే కాదు.. జంతువులు కూడా ఫిదా అవుతున్నాయి. ఓ ఏనుగు (Elephant) లొట్టలేసుకుంటూ పానీపూరీ (Golgappas) తింటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
ghantaa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన ఓ వ్యక్తి స్టాల్ పెట్టుకుని పానీపూరీ అమ్ముకుంటున్నాడు. అక్కడకు ఓ ఏనుగు వచ్చింది. వెంటనే ఆ చిరు వ్యాపారి గోల్‌గప్పాలో పానీ వేసి ఏనుగుకు ఇస్తున్నాడు. ఆ ఏనుగు తొండంతో ఆ పానీపూరీని తీసుకుని నోటిలో వేసేసుకుంటోంది. దుకాణదారుడు తన దుకాణానికి వచ్చే కస్టమర్లకు ఎలా పానీపూరీ ఇస్తాడో అదే విధంగా ఏనుగుకు కూడా ఇస్తున్నాడు. ఏనుగు చక్కగా ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ఆ పానీపూరీని ఆరగిస్తోంది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.2 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``గజరాజ్‌కు ఆ బండిలోని పానీపూరీలు మొత్తం సరిపోవు``, ``చాలా అందమైన వీడియో``, ``ఏనుగులు కూడా పానీపూరీలను ఇష్టపడాల్సిందే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: తుది వీడ్కోలు ఇలాగే ఉండాలేమో.. డెకరేట్ చేసిన కారులో వీళ్లు వెళ్తోంది పెళ్లికి కాదు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి