Viral Video: దీపావళి టపాసులు పేల్చుతున్నారని ఇలా చేస్తారా? పై నుంచి గ్యాస్ సిలిండర్ పడేసిన వ్యక్తి..
ABN , Publish Date - Nov 02 , 2024 | 04:00 PM
రావణాసురుడిని చంపిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చిన పర్వదినం సందర్భంగా దీపావళి జరుపుకుంటారని కొందరు నమ్ముతారు. నరకాసురుడిని సత్యభామ వధించిన సందర్భంగా దీపావళి జరుపుకుంటారని మరికొందరు నమ్ముతారు. ఏదేమైనా ఆ రోజున దీపాలు, టపాసులతో ప్రజలు ఆనందంగా పండగ చేసుకుంటారు.
దీపావళి (Diwali) అంటే దీపాల పండగ. రావణాసురుడిని చంపిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చిన పర్వదినం సందర్భంగా దీపావళి జరుపుకుంటారని కొందరు నమ్ముతారు. నరకాసురుడిని సత్యభామ వధించిన సందర్భంగా దీపావళి జరుపుకుంటారని మరికొందరు నమ్ముతారు. ఏదేమైనా ఆ రోజున దీపాలు, టపాసులతో (Fire crackers) ప్రజలు ఆనందంగా పండగ చేసుకుంటారు. అయితే కొందరు శ్రుతి మించి టపాసులు కాల్చుతూ చుట్టు పక్కల వారికి చిరాకు తెప్పిస్తారు. పండగ రోజు కనుక చాలా మంది ఆ పేలుళ్లను, శబ్దాలను, కాలుష్యాన్ని భరిస్తారు. మరికొందరు మాత్రం గట్టిగా తమ నిరసన తెలియజేస్తారు (Viral Video).
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుటుంబం దీపావళి రోజున గట్టిగా హంగామా చేసింది. వీధిలో టపాసాలు కాల్చుతూ ధ్వని కాలుష్యానికి, వాయు కాలుష్యానికి పాల్పడింది. అదే ఇంటిలో పై ఫ్లోర్‌లో ఉంటున్న వారు ఆ శబ్దాలతో తీవ్రంగా అసౌకర్యానికి గురయ్యారు. మాటలతో చెప్పి చూశారు. అయినా వీరు వినలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పై ఇంటి వారు గ్యాస్ సిలిండర్ (Gas Cylinder)ను తీసుకుని పై నుంచి కిందకు విసిరేశారు. దీంతో అక్కడున్న వారందరూ షాకయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
@Arhantt_pvt అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలు తెలియజేశారు. ``భారత్‌లో ఇలాంటివి సాధారణమే. పొరుగింటి వారు సంతోషంగా పండగ చేసుకుంటే తట్టుకోలేరు``, ``అతడు సిలిండర్ పేల్చుదామనుకున్నాడేమో``, ``దీపావళి రోజున అందర్నీ పేల్చెద్దామ నుకున్నాడు``, ``ఇదెక్కడి ఘోరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అర్ధరాత్రి పోలీసులకు ఫోన్.. చోరీ జరిగిందని వచ్చిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే షాక్..
Optical Illusion Test: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఆక్టోపస్‌ల మధ్యనున్న చేపను కనిపెట్టండి..
Viral video: దీపావళి క్లీనింగ్ సమయంలో ఈ విషయం మర్చిపోకూడదట.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..
Viral Video: వామ్మో.. వాహనాలు గాల్లోకి ఎలా ఎగురుతున్నాయో చూడండి.. కారణం ఏంటో తెలిస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..