Viral Video: బాబోయ్.. హిప్పోకు ఇంత కోపం వస్తుందా?.. టూరిస్ట్‌లకు ఎలా వణికించిందో చూస్తే..
ABN , Publish Date - Dec 15 , 2024 | 07:48 PM
వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వన్య ప్రాణులకు సంబంధించి ఆసక్తికర అంశాల గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో రకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు (Wild Animals) సంబంధించిన వీడియోలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వన్య ప్రాణులకు సంబంధించి ఆసక్తికర అంశాల గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు (Wild Animal Videos) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ హిప్పోపొటామస్ (Hippopotamus)కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది (Viral Video).
Latest Sightings అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను దక్షిణాఫ్రికా (South Africa)లోని ఓ అడవిలో చిత్రీకరించారు. ఆ వీడియో ప్రకారం.. ఓ హిప్పోపొటామస్ అడవిలో ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తోంది. సఫారీ టూర్‌కు వెళ్లిన టూరిస్ట్‌లో జీప్‌లో కూర్చుని ఆ హిప్పోను ఫొటోలు తీయడం ప్రారంభించారు. దీంతో ఆ హిప్పో ఆగ్రహానికి గురైంది. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. వెంటనే అలెర్ట్ అయిన డ్రైవర్ జీప్‌ను వేగంగా వెనక్కి పోనిచ్చాడు. అయినప్పటికీ హిప్పో శాంతించకుండా ఆ జీప్‌ను నోటితో పట్టుకోవడానికి ప్రయత్నించింది. త్రుటిలో ఆ హిప్పో దాడి నుంచి ఆ టూరిస్ట్‌లు తప్పించుకున్నారు.
ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``హిప్పోలు అత్యంత ప్రమాదకర జంతువులు``, ``వాళ్లు త్రుటిలో తప్పించుకున్నారు``, ``వామ్మో.. హిప్పోకు అంత కోపం వస్తుందా``, ``చాలా భయంకర అనుభవం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. ట్రాక్టర్‌ను తోయబోయి ఎంత ప్రమాదంలో ఇరుక్కున్నాడో చూడండి.. వీడియో వైరల్..
Viral Video: చైనాలో అంతే.. భారీ బిల్డింగ్‌ల మీద నుంచి కార్లు ఎలా వెళ్లిపోతున్నాయో చూడండి..
Viral Video: సరదా తీరిపోయింది.. గుర్రం బళ్లతో రేస్.. చివరకు ఆ కుర్రాళ్ల పరిస్థితి ఏమైందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి