Share News

Viral Video: యముడు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాడేమో.. వీడియో కోసం పట్టాలపై పడుక్కున్న యువకుడు.. ఆ తర్వాత..

ABN , Publish Date - Dec 13 , 2024 | 07:59 PM

టీనేజ్‌లో ఉన్న కుర్రాళ్లు పర్యావసానాలను ఆలోచించకుండా వీడియోల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఆ క్రమంలో చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్ది మంది అదృష్టవశాత్తూ తప్పించుకుంటున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Viral Video: యముడు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాడేమో.. వీడియో కోసం పట్టాలపై పడుక్కున్న యువకుడు.. ఆ తర్వాత..
Dangerous Stunt on moving Train

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది పిచ్చి పతాక స్థాయిలకు చేరుతోంది. వ్యూస్, లైక్స్ కోసం వారేం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న కుర్రాళ్లు పర్యావసానాలను ఆలోచించకుండా వీడియోల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు (Dangerous Stunts). ఆ క్రమంలో చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్ది మంది అదృష్టవశాత్తూ తప్పించుకుంటున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటి వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది (Viral Video).


r k_chauhan_ji అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ షాకింగ్ వీడియోను బీహార్‌ (Bihar)లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఇద్దరు కుర్రాళ్లు వీడియో రూపొందించేందుకు రైలు పట్టాల (Railway Track) దగ్గరకు వెళ్లారు. రైలు వస్తుండడం చూసి ఓ కుర్రాడు నేరుగా పట్టాల మీదకు వెళ్లి పడుక్కున్నాడు. రైలు (Train) వేగంగా ఆ కుర్రాడి మీద నుంచి వెళ్లిపోయింది. ఆ కుర్రాడి స్నేహితుడు పక్కనే ఉండి వీడియో తీశాడు. రైలు పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత పట్టాల మీద పడుక్కున్న కుర్రాడు పైకి లేచి బయటకు వచ్చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. 90 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``అలాంటి వ్యక్తులు బతికి బయటపడడాన్ని చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటారేమో అని భయమేస్తోంది``, ``ఆ రోజు యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో``, ``ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణం పోతుంది``, ``ఇలాంటి పిచ్చి వాళ్లు బతకడానికి అనర్హులు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: నీ తెలివికి సలాం బాసూ.. కారును ట్రాక్టర్‌లా ఎలా మార్చేశారో చూడండి.. నెటిజన్ల కామెంట్లు వింటే..


Viral Video: సింహంతో ఆడుకోవాలనుకున్నాడు.. చుక్కలు చూశాడు.. షాకింగ్ వీడియో వైరల్..


Viral Video: రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటున్న కుర్రాడు.. ఆ పేద బాలుడి కళ్లలో సంతోషం కోసం..


IQ Test: మీ బ్రెయిన్‌కు సవాల్.. ఈ ఫొటోలో ఉన్న తప్పు ఏంటో 5 సెకెన్లలో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 13 , 2024 | 08:00 PM