Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. స్పాట్‌లోనే ముగ్గురి మృతికి కారణమైన భయంకర ప్రమాదాన్ని చూడండి..
ABN , Publish Date - Oct 14 , 2024 | 11:04 AM
చాలా మంది ట్రాఫిక్ నియమాలను పాటించకుండా అతివేగంతో ప్రయాణిస్తూ తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమే కాకుండా, ఇతరులకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తారు. రెండ్రోజుల క్రితం పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో జరిగిన యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.
అతి వేగం (Speed) అత్యంత ప్రమాదకరం అని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా చాలా మంది పెడచెవిన పెడుతుంటారు. ట్రాఫిక్ నియమాలను (Traffic Rules) పాటించకుండా అతివేగంతో ప్రయాణిస్తూ తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమే కాకుండా, ఇతరులకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తారు. రెండ్రోజుల క్రితం పశ్చిమబెంగాల్ (West Bengal)లోని కూచ్‌బెహార్‌లో జరిగిన యాక్సిడెంట్ (Road Accident) దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు (Viral Video).
@aadharamos అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. కూచ్‌బెహార్‌లోని ఓ జంక్షన్ వద్ద ఓ ఎస్‌యూవీ కారు మెల్లిగా టర్న్ అవుతోంది. ఆ సమయంలో ఓ బైకర్ అత్యంత వేగంగా వచ్చి ఆ కారును ఢీకొన్నాడు. ఆ బైకర్ వేగానికి క్షణాల వ్యవధిలో బారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకున్న బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ బైక్ ఢీకొట్టిన వేగానికి కారులో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు కూడా స్పాట్‌లోనే ప్రాణాలు వదిలేశారు. ఈ ఘటన అక్టోబర్ 11వ తేదీ రాత్రి జరిగింది. ఆ యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోను తక్కువ సమయంలోనే దాదాపు 13 వేల మంది వీక్షించారు. చాలా మంది ఈ వీడియో చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ``ప్రతి బైకర్‌ను ఈ వీడియో పీడకలలా వెంటాడుతుంది``, ``చాలా విషాదకరం``, ``డైరెక్ట్‌గా కారు పెట్రోల్ ట్యాంక్‌ను ఢీకొట్టాడా``, ``అంత వేగంగా మంటలు ఎక్కణ్నుంచి వచ్చాయి``, ``కారులోని ఇద్దరు ప్రయాణికులు ఎలా చనిపోయారు``, ``చాలా భయంకర యాక్సిడెంట్``, ``అతి వేగం అత్యంత ప్రమాదకరం``, ``కనీసం జంక్షన్ల దగ్గరైనా నెమ్మదిగా వెళ్లాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు.. కాళ్లు లేకపోయినా ధైర్యంగా ముందుకెళ్లొచ్చు.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..