Viral Video: వధూవరులు ఎవరికి కావాలి.. అతిథుల ధాటికి వడ్డించే వాళ్ల పరిస్థితి ఏమైందో చూడండి..
ABN , Publish Date - Nov 27 , 2024 | 05:06 PM
పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ ఘటనలు చాలా మందికి ఆసక్తికరంగా అనిపిస్తాయి. అంతేకాదు పెళ్లి అంటే గొడవలకు కూడా వేదిక అయిపోతోంది. భోజనాల కోసం తన్నుకుంటున్న వీడియో ఇటీవల వైరల్ అయింది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు.
ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ (Wedding) జోరుగా సాగుతోంది. పెళ్లిళ్లకు సంబంధించిన రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి (Wedding Videos). పెళ్లిళ్లలో జరిగే పోరాటాల నుంచి పెళ్లి ఊరేగింపుల వరకు ప్రతి దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేస్తున్నారు. పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ ఘటనలు చాలా మందికి ఆసక్తికరంగా అనిపిస్తాయి. అంతేకాదు పెళ్లి అంటే గొడవలకు కూడా వేదిక అయిపోతోంది. భోజనాల (Wedding Feast) కోసం తన్నుకుంటున్న వీడియో ఇటీవల వైరల్ అయింది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు (Viral Video).
swagsedoctorofficial అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి వేడుకలో నాన్-వెజ్ కౌంటర్ దగ్గర హడావుడి నెలకొంది. ఆకలితో ఉన్న అతిథులు నాన్ వెజ్ కౌంటర్‌పై ఎలా దాడి చేశారో చూడొచ్చు. అతిథులు తమ చేతుల్లో ప్లేట్‌లతో ఒకరినొకరు తోసుకుంటున్నారు. చికెన్ టిక్కా, కబాబ్ మొదలైన నాన్ వెజ్ వంటకాల కౌంటర్ల ముందు బారులు తీరారు. వారికి ఎలా వడ్డించాలో తెలియక వెయిటర్లు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. దీంతో అతిథులే స్వయంగా తమ చేతికి దొరికిన వంటకాన్ని వడ్డించుకుని వెళ్లిపోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 70 లక్షల మంది వీక్షించారు. 6.2 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ సీజన్‌లో భారతదేశంలో 48 లక్షల వివాహాలు జరుగుతాయి``, ``వారు భోజనం కోసమే వచ్చినట్టున్నారు``, ``పాపం.. వధూవరులను ఎవరూ పట్టించుకోవడం లేదు``, ``ఈ సీజన్‌లో పెళ్లి కోసం అందరూ కలిసి రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. ఈమెకు ఏమైంది.. ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కినందుకు ఏం జరిగిందో తెలిస్తే..
Viral Video: పానీపూరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. ఏనుగు ఎలా లొట్టలేసుకుంటూ తింటోందో చూడండి..
Viral Video: తుది వీడ్కోలు ఇలాగే ఉండాలేమో.. డెకరేట్ చేసిన కారులో వీళ్లు వెళ్తోంది పెళ్లికి కాదు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి