Viral Video: వామ్మో.. కోడికి ఇంత పవర్ ఉంటుందా? గాల్లో ఎంత దూరం ఎగిరిందో చూడండి..
ABN , Publish Date - Mar 25 , 2024 | 08:44 PM
కోళ్లు పక్షి జాతికి చెందినవే అయినా, బరువు ఎక్కువగా ఉండడం వల్ల అవి ఎగరలేవు. ఒకవేళ ఎగిరినా కొన్ని అడుగులు మాత్రమే ప్రయాణించగలవు.
కోళ్లు (Hen) పక్షి జాతికి చెందినవే అయినా, బరువు ఎక్కువగా ఉండడం వల్ల అవి ఎగరలేవు. ఒకవేళ ఎగిరినా కొన్ని అడుగులు మాత్రమే ప్రయాణించగలవు. అయితే ఆ అభిప్రాయం తప్పని తాజాగా ఓ కోడి నిరూపించింది. ఆ కోడి గాల్లో చాలా దూరం ఎగిరి వెళ్లింది (Hen Flying). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
@AmazingNature అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ నది ఒడ్డున కోళ్ల గుంపు ఉంది. అందులో ఓ కోడి హఠాత్తుగా ఎగరడం ప్రారంభించింది. ఆ కోడి నదిలో పడిపోతుందేమోనని అనుకుంటే.. అది అతి వేగంగా ఎగురుతూ అవతలి ఒడ్డుకు చేరుకుంది. దాదాపు అర కిలోమీటర్ దూరం ఆ కోడి పెట్ట ఎగరగలిగింది. ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
Viral Video: వేడికి తట్టుకోలేక మడుగులోకి దిగిన పులి.. రెడ్ బాల్‌పై ఎలా విశ్రాంతి తీసుకుంటోందో చూడండి..
ఈ వైరల్ వీడియోకు లక్షల్లో వ్యూస్ లభించాయి. చాలా మంది ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయారు. ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``కోళ్లు ఎగరగలవు, ఈత కొట్టగలవు``, ``కోడి ఇంత దూరం ఎగరడం నేను చూడలేదు``, ``కోళ్లు ఉన్న చోటు నుంచి పైకి ఎగురతాయి, ఇది విచిత్రంగా ఉంది``, ``ఆ కోడి ఎందుకు నది దాటాలనుకుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.