Viral Video: తప్పక చూడాల్సిన వీడియో.. మంచు మీద లావా ప్రవహిస్తుంటే ఎలా ఉందో చూడండి..
ABN , Publish Date - Nov 17 , 2024 | 10:15 AM
ప్రస్తుత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎన్నో అద్భుతాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. చాలా వీడియోలు చూస్తుంటే ఇవి ఏఐ వీడియోలా, సహజమైనవా అని తెలుసుకోవడం చాలా కష్టమవుతోంది. ప్రకృతికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రకృతి (Nature) ఎన్నో అద్భుతాల సమాహారం. ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. ప్రస్తుత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో ఎన్నో అద్భుతాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. చాలా వీడియోలు చూస్తుంటే ఇవి ఏఐ వీడియోలా (AI Videos), సహజమైనవా (Nautre Wonders) అని తెలుసుకోవడం చాలా కష్టమవుతోంది. ప్రకృతికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏఐ వీడియో అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే నిజంగానే చిత్రీకరించిందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. (Viral Video)
ఫోటోగ్రాఫర్ జెరోయెన్ వాన్ న్యూవెన్‌హోవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియోను పంచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ వీడియోను చిత్రీకరించినట్టు తెలిపారు. సుంధ్నుకగిగర్ అగ్నిపర్వతం పేలినప్పుడు, లావా (Lava) బయటకు ప్రవహించింది. ఆ సమయంలో ఈ వీడియోను టాప్ డౌన్ యాంగిల్‌లో చిత్రీకరించే అవకాశం తనకు వచ్చిందని జెరోయెన్ తెలిపారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో తెల్లటి మంచు (Snow)పై ఎర్రని లావా ప్రవహిస్తోంది. ఆ దృశ్యం చూడడానికి అత్యంత రమణీయంగా ఉంది. మంచుపై నుంచి లావా ప్రవహించే సమయంలో.. వేడి లావా మంచును కరిగించడానికి ప్రయత్నిస్తుంది. అయితే మంచు ఆవిరి పొరను సృష్టించి దిగువ పొరను కరగకుండా కాపాడుతుంది.
ప్రకృతి అందానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. 4.4 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``మంచుకు చలి వేసి వేడి లావాను దుప్పటిలా కప్పుకుంటోంది``, ``మనం ఊహించలేని వాటిని అంగీకరించడం కష్టం``, ``ఇది ఏఐ వీడియోలా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇదేందయ్యా ఇదీ.. నిజమా? మాయా?.. కీ బోర్డ్‌తో కారును ఎలా కంట్రోల్ చేస్తున్నాడో చూడండి..
Viral: తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. ఎక్స్ రే చూసి నివ్వెరపోయిన డాక్టర్..
Optical Illusion Test: మీది హెచ్‌డీ చూపు అయితే.. ``8``ల మధ్యనున్న ``3``ను 3 సెకెన్లలో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి