Viral Video: పశువుల షెడ్‌లోకి చిరుత పులి.. ఆవు వెళ్లి ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..
ABN , Publish Date - Nov 12 , 2024 | 01:56 PM
వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. తమ షెడ్‌లోకి వచ్చిన చిరుత పులితో ఓ ఆవు ప్రవర్తించిన తీరు చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు (Wild Animals) సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. తమ షెడ్‌లోకి వచ్చిన చిరుత పులితో (Leopard) ఓ ఆవు (Cow) ప్రవర్తించిన తీరు చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).
abhimahale9 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. షెడ్‌లో కొన్ని ఆవులను కట్టేసి ఉంచారు. ఆ ఆవులకు సమీపంలోనే ఓ చిరుత పులి నేలపై కూర్చుని ఉంది. దానిని కూడా కట్టేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్ తాలూకాలోని దోడి గ్రామంలోకి ప్రవేశించి గాయపడిన చిరుతను అటవీ అధికారులు రక్షించి, చికిత్స అందించి ఆ షెడ్‌లో ఉంచారు. ఆ చిరుతను చూసిన ఓ ఆవు దాని దగ్గరకు వెళ్లింది. తన నాలుకతో ప్రేమగా ఆ చిరుతను నిమిరింది. ఆ సమయంలో చిరుత చాలా ప్రశాంతంగా కూర్చుని ఉంది. ఆవుపై ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గాయపడిన చిరుతకు చికిత్స అందించి, అది కోలుకున్న తర్వాత అడవిలోకి వదిలేసినట్టు ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి తెలిపారు. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 3.6 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆవు ఎవరికైనా తల్లి లాంటిదే``, ``చిరుత నుంచి ఇలాంటి ప్రవర్తనను ఊహించలేం``, ``చిరుత తీవ్రంగా గాయపడి ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: తల లేకుండా 18 నెలలు బతికిన కోడి.. తన ఓనర్‌కు కోట్లు ఎలా సంపాదించి పెట్టిందంటే..
Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం.. ప్లేట్‌లో వడ్డించిన చేప ఎలా నడిచిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి