Share News

Viral Video: ఆమె ఓ పని మనిషి.. 30 ఏళ్లు కష్టపడి పని చేసి కొడుకుని చదివిస్తే.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో

ABN , Publish Date - Nov 23 , 2024 | 07:27 AM

తాము ఏ స్థితిలో ఉన్నా తమ పిల్లలు మాత్రం ఉన్నత స్థానంలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. తమ కలను నెరవేర్చుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడి పిల్లలను చదివిస్తుంటారు. ఏ అండదండ, సహాయం లేని మహిళ కూడా తన పిల్లాడి కోసం అన్నీ త్యాగం చేసి పని చేసిన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: ఆమె ఓ పని మనిషి.. 30 ఏళ్లు కష్టపడి పని చేసి కొడుకుని చదివిస్తే.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో
mother started crying with joy when she saw her son become a pilot

తమ పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలని తల్లిదండ్రులందరూ (Parents) కోరుకుంటారు. తాము పడిన కష్టాలు, చేసిన పోరాటాలు పిల్లలకు ఎదురవకూడదని అనుకుంటారు. తాము ఏ స్థితిలో ఉన్నా తమ పిల్లలు మాత్రం ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటారు. తమ కలను నెరవేర్చుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడి పిల్లలను చదివిస్తుంటారు. ఏ అండదండ, సహాయం లేని మహిళ కూడా తన పిల్లాడి కోసం అన్నీ త్యాగం చేసి పని చేసిన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి (Mother)ని అర్థం చేసుకున్న కొడుకు (Son) కష్టపడి చదువుకుని ఆమె కలను నిజం చేశాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@heartwarmedd అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ విమానాశ్రయంలో ఆగి ఉన్న విమానం ఎక్కింది. విమానంలో ఎయిర్‌హోస్టెస్ ఆమె పాస్‌పోర్ట్ తనిఖీ చేసి పెలెట్‌ (Pilot)ను చూపించింది. అతడిని చూడగానే ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకంటే ఆ మహిళ కొడుకే ఆ విమానాన్ని నడపబోతున్న పైలెట్. దాదాపు 30 ఏళ్లు పని మనిషిగా చేసి ఆ డబ్బులతో తన కొడుకును ఆమె చదవించింది. అతడు కష్టపడి చదివి విమానం పైలెట్ అయ్యాడు. విధి నిర్వహణలో ఉన్న కొడుకును చూడగానే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇద్దరూ కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యారు.


ఆ ఘటన మొతాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఇది చాలా ఎమోషనల్ మూమెంట్``, ``ఆ తల్లికి అభినందనలు``, ``ఈ వీడియో చూసిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి``, ``తల్లిదండ్రుల త్యాగాలకు పిల్లలు ఇలాంటి ఫలితాలనే అందించాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వావ్.. ఈ ఎలుగుబంటి చాలా తెలివైంది.. కార్ డోర్ ఎలా తీసిందో చూడండి.. తర్వాత ఏం చేసిందంటే..


IQ Test: మీ బ్రెయిన్‌కు సవాల్.. ఈ ఫొటోలో రెండు తప్పులు ఉన్నాయి.. 10 సెకెన్లలో కనుక్కోండి..


Viral Video: ఛీ.. ఛీ.. ఇండియా గేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శన.. రీల్స్ కోసం నడిరోడ్డుపై టవల్‌తో డ్యాన్స్..


Viral: మేం అంబానీల కంటే తక్కువ కాదు.. మా ఇంట పెళ్లికి రండి.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 23 , 2024 | 07:27 AM