Share News

Viral Video: ముసలోడే కానీ, మహానుభావుడు.. పోటీలో కుర్రాడిని ఎలా బోల్తా కొట్టించాడో చూడండి..

ABN , Publish Date - Dec 06 , 2024 | 04:41 PM

శారీరక శక్తి అవసరమయ్యే పనులు చేయడంలో కుర్రాళ్లతో పోటీపడడం వృద్ధులకు సులభం కాదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వృద్ధుడు.. కుర్రాడితో పోటీ పడడమే కాకుండా అతడిని ఓడించాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Video: ముసలోడే కానీ, మహానుభావుడు.. పోటీలో కుర్రాడిని ఎలా బోల్తా కొట్టించాడో చూడండి..
old man defeated young man in log rolling competition

సాధారణంగా వయసు పెరిగే కొద్ది శారీరకంగా, మానసికంగా ఎంతో కొంత బలహీనులు కావడం సహజం. కొందరు మానసికంగా బలంగానే ఉన్నప్పటికీ శారీరకంగా మాత్రం ఫిట్‌గా ఉండలేరు. ముఖ్యంగా శారీరక శక్తి అవసరమయ్యే పనులు చేయడంలో కుర్రాళ్లతో పోటీపడడం వృద్ధులకు (Oldage) సులభం కాదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వృద్ధుడు (Old Man).. కుర్రాడితో పోటీ పడడమే కాకుండా అతడిని ఓడించాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


german.a.almonte అనే ఇన్‌‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో లాగ్ రోలింగ్ (Log rolling) పోటీ జరుగుతోంది. ఆ పోటీలో ఓ కుర్రాడితో వృద్ధుడు పోటీ పడ్డాడు. నీటి మీద తేలుతున్న ఓ దుంగపై రోలింగ్ చేస్తూ చివరి వరకు నిలబడిన వారే ఆ పోటీలో విజేతలు. ఆ పోటీలో కుర్రాడితో పోటీ పడిన 70 ఏళ్ల వృద్ధుడు అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ తలపడ్డాడు. ఆ కుర్రాడు ఆ వృద్ధుడిని పడెయ్యడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. అయినా ఆ వృద్ధుడు తడబడలేదు. ఆ వృద్ధుడిని తక్కువగా అంచాన వేసిన కుర్రాడు దూకుడుగా ప్రయత్నించి, బ్యాలెన్స్ కోల్పోయి నీటిలో పడిపోయాడు.


ఆ పోటీలో విజయం సాధించడం ద్వారా వృద్ధుడు వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించాడు. సమయస్ఫూర్తితో కుర్రాడిని బోల్తా కొట్టించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోలోని వృద్ధుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. కుక్కను మింగేసి కదల్లేకపోతున్న భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..


Viral News: అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్.. వియత్నాంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం ఏంటంటే..


Viral Video: ఈ కుక్కకు ఏమైంది.. పెళ్లి మండపంలో వధువుకు చుక్కలు చూపించిన పెట్ డాగ్..


Viral News: వావ్.. వంట మనిషి కోసం రెజ్యూమ్.. వెల్లువలా వస్తున్న జాబ్ ఆఫర్లు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2024 | 04:41 PM