Share News

Viral Video: కర్ర పట్టుకొచ్చి పోలీస్ కానిస్టేబుల్ హల్‌చల్.. ట్రక్ డ్రైవర్ మాటలకు భయపడి పరార్..

ABN , Publish Date - Dec 14 , 2024 | 03:16 PM

ట్రక్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లను కొంత మంది పోలీసులు భయపెడుతుంటారు. తప్పు లేకపోయినా బెదిరిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ పోలీస్ కానిస్టేబుల్ అలాగే చేశాడు. తాను తప్పు చేయడమే కాకుండా.. ఎదురుగా వచ్చిన లారీ డ్రైవర్‌పై దాడికి దిగాడు.

Viral Video: కర్ర పట్టుకొచ్చి పోలీస్ కానిస్టేబుల్ హల్‌చల్.. ట్రక్ డ్రైవర్ మాటలకు భయపడి పరార్..
police fight with truck driver

చాలా మంది పోలీసులు (Police) అమాయకులపై జులుం ప్రదర్శిస్తుంటారు. నిరక్ష్యరాస్యులను, అమాయకులను ఎంచుకుని వారిపై తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. ముఖ్యంగా ట్రక్ డ్రైవర్లు (Truck Driver), ఆటో డ్రైవర్లను భయపెడుతుంటారు. తప్పు లేకపోయినా బెదిరిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ పోలీస్ కానిస్టేబుల్ (Police Conistable) అలాగే చేశాడు. తాను తప్పు చేయడమే కాకుండా.. ఎదురుగా వచ్చిన లారీ డ్రైవర్‌పై దాడికి దిగాడు. అయితే ఆ డ్రైవర్ తగిన బుద్ధి చెప్పడంతో అక్కణ్నించి పరారయ్యాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


safalbanoge అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పోలీస్ కానిస్టేబుల్ రాంగ్ రూట్‌లో తన కారును రోడ్డుపై పోనిస్తున్నాడు. ఆ రూట్‌లో వస్తున్న ట్రక్ డ్రైవర్.. ఆ పోలీస్ కారుకు దారి ఇవ్వలేదు. దీంతో ఆ కానిస్టేబుల్ కారు దిగి కర్ర తీసుకుని ఆ ట్రక్ డ్రైవర్ దగ్గరకు వెళ్లాడు. గట్టిగా కేకలు వేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ లారీ డ్రైవర్ మాత్రం భయపడలేదు. ``నీ దగ్గర కర్ర ఉంటే.. నా దగ్గర ఐరన్ రాడ్ ఉంది. ధైర్యం ఉంటే రండి. నేను ఈ రోజు మీకు చూపిస్తాను`` అంటూ కేకలు వేశాడు. పక్కనే ఉన్న వ్యక్తి వీడియో తీశాడు. లారీ డ్రైవర్ భయపడకకుండా సవాల్ చేయడం, వేరే వ్యక్తి వీడియో తీస్తుండడంతో ఆ పోలీస్ కానిస్టేబుల్ భయపడ్డాడు.


కొంచెం దూకుడు తగ్గించి వెనక్కి వెళ్లిపోయాడు. ఏదో తిట్టుకుంటూ కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ డ్రైవర్ అప్పుడే పుష్ప-2 సినిమా చూసినట్టున్నాడు``, ``తప్పు చేయకపోతే వచ్చే ధైర్యం అది``, ``తప్పుడు పోలీస్‌కు సరైన బుద్ధి చెప్పాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ఆకుల మధ్యనున్న కప్పను 5 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌ను ఎంచుకునేందుకు ``ఏబీసీడీఈ రూల్``.. ఈ వ్యక్తి చెప్పే టిప్స్ వింటే షాకవ్వాల్సిందే..

Viral Video: యముడు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాడేమో.. వీడియో కోసం పట్టాలపై పడుక్కున్న యువకుడు.. ఆ తర్వాత..


Viral Video: నీ తెలివికి సలాం బాసూ.. కారును ట్రాక్టర్‌లా ఎలా మార్చేశారో చూడండి.. నెటిజన్ల కామెంట్లు వింటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 14 , 2024 | 03:16 PM