Viral Video: ట్రాక్టర్ పట్టుకెళ్లేందుకు వచ్చిన లోన్ రికవరీ ఏజెంట్లు.. వాళ్లను బెదిరించడానికి యువతి ఏం చేసిందంటే..
ABN , Publish Date - Sep 18 , 2024 | 11:35 AM
బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఏదైనా కొనుక్కుంటే ప్రతి నెలా వాయిదాలు చెల్లించాల్సిందే. రెండు, మూడు నెలలు కట్టకపోతే బ్యాంక్ ఏజెంట్లు వచ్చి ఆ వస్తువులను తీసుకెళ్లిపోతారు. ఆ ఏజెంట్లను ఆపేందుకు చాలా మంది రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. అబద్ధాలు చెబుతుంటారు.
బ్యాంక్ నుంచి లోన్ (Loan) తీసుకుని ఏదైనా కొనుక్కుంటే ప్రతి నెలా వాయిదాలు చెల్లించాల్సిందే. రెండు, మూడు నెలలు కట్టకపోతే బ్యాంక్ ఏజెంట్లు (Loan recovery Agents) వచ్చి ఆ వస్తువులను తీసుకెళ్లిపోతారు. ఆ ఏజెంట్లను ఆపేందుకు చాలా మంది రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. అబద్ధాలు చెబుతుంటారు. అయితే రాజస్తాన్ (Rajasthan)కు చెందిన ఓ మహిళ లోన్ రికవరీ ఏజెంట్లను నిలువరించేందుకు విచిత్రమైన పని చేసింది. ఆమె యాక్టింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు (Viral Video).
ashokdamor864 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. రాజస్థాన్‌లోని బన్స్వారాకు చెందిన ఓ మహిళ ఇంటికి లోన్ రికవరీ ఏజెంట్లు వెళ్లారు. రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో ఏజెంట్లు ట్రాక్టర్‌ను వెనక్కి తీసుకోవాలన్నారు. ఆ ఏజెంట్లను చూడగానే ఆ మహిళ డ్రామా పండించింది. దెయ్యం పట్టిన దానిలా ప్రవర్తించింది. కళ్లు మూసుకుని, చేతులు పైకెత్తి ఊగిపోయింది. బ్యాంక్ ఏజెంట్లపై శాపనార్థాలు కురిపించింది. తిడుతూ, బెదిరింపులు మొదలుపెట్టింది. దీంతో ఆ బ్యాంకు ఏజెంట్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 43 లక్షల మంది వీక్షించారు. లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. ``ఆమె నుంచి డబ్బులు వసూలు చేయడం సాధ్యం కాదు``, ``ఇదెక్కడి విడ్డూరం``, ``చాలా విచిత్రంగా ఉంది``, ``ఇంతకీ ఆ ఏజెంట్లు ఏం చేశారు. ట్రాక్టర్‌ను తీసుకెళ్లారా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: ఇదెక్కడి రూల్ నాయనా? బెంగళూరులోని ఆ మాల్‌లో రెస్ట్‌రూమ్ వాడుకోవాలంటే..
Anand Mahindra: వెనిస్‌లో కూడా ముంబై తరహా ట్రాఫిక్ జామ్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..