Viral Video: ఈమెను పెళ్లి చేసుకుంటే అప్పులన్నీ మాయం.. పెళ్లిలో వధువుకు వచ్చిన నగదు బహుమతులు చూస్తే..
ABN , Publish Date - Dec 01 , 2024 | 07:10 PM
ఒకరు పాటించే ఆచారాలు మరొకరికి వింతగా ఉంటాయి. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఎక్కడ, ఏం జరిగినా అందరికీ తెలిసిపోతోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని వధువు శరీరం మొత్తం భారీగా కరెన్సీ నోట్లతో నిండిపోయి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా రకరకాల సాంప్రదాయాల వాళ్లు, రకరకాల పద్ధతుల్లో పెళ్లిళ్లు (Wedding) చేసుకుంటారు. రకరకాల ఆచారాలను పాటిస్తుంటారు. ఒకరు పాటించే ఆచారాలు మరొకరికి వింతగా ఉంటాయి. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఎక్కడ, ఏం జరిగినా అందరికీ తెలిసిపోతోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని వధువు (Bride) శరీరం మొత్తం భారీగా కరెన్సీ నోట్లతో నిండిపోయి ఉంది. ఆమె మొహం కాకుండా, ప్రతి చోటా నోట్లు (Currency Notes) వేలాడుతూనే ఉన్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
comede_clab అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వధువు శరీరం నిండా కరెన్సీ నోట్లు అంటించి ఉన్నాయి. ఆమె పక్కనే పురోహితుడు నిలబడి ఉన్నాడు. అతిథులు వధువు దగ్గరకు వచ్చి కరెన్సీ నోట్లను ఆమె దుస్తులకు అంటిస్తున్నారు. దాంతో ఆ వధువు శరీరం మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో ఆ వైరల్ వీడియోను దాదాపు 20 లక్షల మంది వీడియోను వీక్షించారు. 2.7 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఆమె వధువులా కనిపించడం లేదు, బ్యాంక్‌లా కనిపిస్తోంది``, ``ఆమెను పెళ్లి చేసుకున్న వారి అప్పులన్నీ తీరిపోతాయి``, ``ఆమెను వివాహం చేసుకునే వ్యక్తి ఇకపై ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ట్రైన్ తలుపు నుంచి వింత శబ్దాలు.. వాటిని ఆపేందుకు ఓ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..
Viral Video: అచ్చం మనిషిలాగానే పరిగెడుతున్న కోతి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Viral Video: వామ్మో.. ఇతని మీద ఇతనికి ఎంత నమ్మకమంటే.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి