Viral Video: ఇది సాధారణ టీ కాదు.. ఈ స్పెషల్ టీ తాగాలంటే లక్షాధికారులై ఉండాల్సిందే.. దీని స్పెషాలిటీ ఏంటంటే..
ABN , Publish Date - Nov 26 , 2024 | 05:26 PM
మనదేశంలో చాలా మంది టీని ఔషధంగా భావిస్తారు. చిన్నపాటి తలనొప్పుల నుంచి టీ ఉపశమనం అందిస్తుందని నమ్ముతారు. మనదేశంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, స్టాల్స్ దగ్గర రకరకాల టీలు దొరుకుతాయి. హెర్బల్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ.. ఇలా ఒక్కో టీని ఒక్కో రేటుకు విక్రయిస్తారు.
ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది టీ (Tea) తాగుతారు. ముఖ్యంగా మన దేశంలో టీకి విపరీతమైన అభిమానులున్నారు. టీ తాగకపోతే చాలా మంది రోజు పూర్తి కాదు. మనదేశంలో చాలా మంది టీని ఔషధంగా భావిస్తారు. చిన్నపాటి తలనొప్పుల నుంచి టీ ఉపశమనం అందిస్తుందని నమ్ముతారు. మనదేశంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, స్టాల్స్ దగ్గర రకరకాల టీలు దొరుకుతాయి. హెర్బల్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ.. ఇలా ఒక్కో టీ ఒక్కో రేటుకు విక్రయిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి తాగుతున్న టీ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే (Costly Tea). ఎందుకంటే ఆ టీ తాగాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి మరి (Viral Video).
gulfbuzz అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను దుబాయ్ (Dubai)లోని బోహో కేఫ్‌లో (Boho Cafe) చిత్రీకరించారు. ఆ కేఫ్‌కు ఎంతో మంది ధనవంతులు వెళుతుంటారు. ఆ కేఫ్‌లో వెండి కప్పు, వెండి సాసర్‌లో టీ అందిస్తారు. టీ కప్పు లోపల 24 క్యారెట్ల బంగారంతో కూడిన షీట్ ఉంటుంది. ఉత్తమమైన తేయాకుతో చేసిన టీ బంగారం పూతతో కలవడం వల్ల మంచి రుచిగా ఉంటుంది. అంతేకాదు.. టీ తాగిన తర్వాత ఆ వెండి కప్పు, సాసర్‌ను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చట. ఇంతకీ ఆ టీ ఎంతో తెలుసా.. 5000 దీనార్‌లు. అంటే మన కరెన్సీలో అక్షరాలా.. 1 లక్షా 14 వేల 750 రూపాయలు.
ఒక అమ్మాయి తాజాగా ఆ కెఫ్‌లో టీ తాగి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``టీ తాగడానికి ఈఎమ్‌ఐ తీసుకోవలసి ఉంటుందని నేను కలలో కూడా అనుకోలేదు``, ``డబ్బు వేస్ట్ చేసుకోవాలంటే ఆ కేఫ్‌కు వెళ్లాలి``, ``ఇదంతా వృథా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ తెలివి తేటలు చూస్తే షాకవ్వాల్సిందే.. బైక్ ఇంజిన్‌లతో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..
Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి సవాల్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి..
Viral Video: రోడ్డుపై డెత్ స్టంట్.. డబుల్ డెక్కర్ బైక్ స్టంట్ చూస్తే చెమటలు పట్టడం ఖాయం..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి