Share News

Viral Video: ఓర్నీ.. ఇంతకు తెగిస్తారా? ప్రజల కళ్ల ముందే కిడ్నాప్.. చివరకు బయట పడిన షాక్ ఏంటంటే..

ABN , Publish Date - Oct 26 , 2024 | 08:55 AM

సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదకర బైక్ స్టంట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వింత ప్రయత్నాలు చేసి ఇతరులను ఆందోళనకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే.

Viral Video: ఓర్నీ.. ఇంతకు తెగిస్తారా? ప్రజల కళ్ల ముందే కిడ్నాప్.. చివరకు బయట పడిన షాక్ ఏంటంటే..
Two boys Kidnapped friend on the road to make a reel

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా (Social Media)కు రోజురోజుకు పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదకర బైక్ స్టంట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వింత ప్రయత్నాలు చేసి ఇతరులను ఆందోళనకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఆ యువకులు వింత ప్రయత్నం చేశారు. చివరకు అరెస్ట్ అయి జైలులో కూర్చున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@SachinGuptaUP అనే ట్విటర్ యూజర్ ఆ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువకుడు రోడ్డు పక్కన ఉన్న స్టాల్ దగ్గర స్నాక్స్ తింటున్నాడు. ఆ సమయంలో ఇద్దరు యువకులు బైక్ మీద అక్కడకు వచ్చారు. ఆ యువకుడికి మత్తు మందు ఇచ్చి బైక్ మీద ఎక్కించుకున్నారు (Kidnap Reel). చుట్టూ ఉన్న వారు ఆ దృశ్యం చూసి షాకైపోయారు. బైక్ త్వరగా స్టార్ట్ కాకపోవడంతో చుట్టూ ఉన్న వారు అక్కడకు వచ్చారు. జనాలు ఎక్కువ మంది వారిని చుట్టు ముట్టడంతో ఆ కుర్రాళ్లు అసలు విషయాన్ని చల్లగా బయటపెట్టారు. తాము రీల్ కోసం అలా చేస్తున్నామని కెమెరామ్యాన్‌ను చూపించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh)లోని ముజఫర్‌నగర్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు.


ఆ వీడియో బాగా వైరల్ అయి పోలీసుల దృష్టికి వెళ్లింది. విచారణ ప్రారంభించిన పోలీసులు న్యూసెన్స్ కేసు పెట్టి ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. కాగా, ఆ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించి తమ అభిప్రాయాలను తెలియజేశారు. ``ఇదెక్కడి పిచ్చి ప్రయత్నం``, ``రీల్ చేసి జైల్‌కు వెళ్లారు``, ``ఇలాంటి వారికి పోలీసులు తగిన బుద్ధి చెప్పాలి``, ``వాళ్ల క్రియేటివిటీ నెక్ట్స్ లెవెల్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ఇది ``మంజుమ్మల్ బాయ్స్`` కథ.. మొబైల్ కోసం వెళ్లి గుహలోకి వెళ్లిన యువతికి ఏమైందంటే..


Viral: ఆ స్కూల్‌లో పేరెంట్స్‌‌కి కూడా ఫీజు కట్టాల్సిందే.. నర్సరీకి ఎంత ఫీజు కట్టాలో తెలిస్తే.. పోస్ట్ వైరల్..

Optical Illusion: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ``Kite`` పదాన్ని 5 సెకెన్లలో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 26 , 2024 | 08:55 AM