Viral Video: ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు.. కాళ్లు లేకపోయినా ధైర్యంగా ముందుకెళ్లొచ్చు.. వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 14 , 2024 | 08:15 AM
కల్మషం లేని పిల్లలు తమ స్నేహితుడు కష్టాల్లో ఉన్నారంటే చలించిపోతారు. అతడికి అండగా నిలబడతారు. అలాంటి ఓ అందమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ కుర్రాళ్లను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
కాళ్లు, చేతులు లేకపోయినా, మేమున్నామని ధైర్యం చెప్పే స్నేహితులు (Friends) ఉంటే చాలు.. ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొని బతకు పోరాటం సాగించవచ్చు. పెద్దవాళ్లలో కంటే అలాంటి ఐకమత్యం (Unity) చిన్న పిల్లల్లో ఎంతో ఎక్కువగా కనబడుతుంది. కల్మషం లేని పిల్లలు తమ స్నేహితుడు కష్టాల్లో ఉన్నారంటే చలించిపోతారు. అతడికి అండగా నిలబడతారు. అలాంటి ఓ అందమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ కుర్రాళ్లను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు (Viral Video).
V. Sivankutty అనే ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను కేరళలోని కొల్లంలో ఉన్న ఓ పాఠశాలలో చిత్రీకరించారు. ఆ వీడియోలో ఓ కుర్రాడు నడవలేకపోవడంతో వీల్ ఛైర్‌లో కూర్చుని ఉన్నాడు. భోజన విరామ సమయంలో తిన్న తర్వాత స్నేహితులు అతడికి సేవలు చేస్తున్నారు. ఓ స్నేహితుడు ఆ కుర్రాడు తిన్న కంచం కడిగాడు. అనంతరం అతడి నోరు కూడా కడిగాడు. పక్కనే ఉన్న మరో స్నేహితుడు ఆ వీల్ ఛైర్‌ను తోయడానికి ముందుకు వచ్చాడు. ఆ ఘటనను ఓ టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హృద్యమైన ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. కష్టంలో ఉన్న స్నేహితుడికి సహాయం చేస్తున్న ఆ కుర్రాళ్లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``ఇలాంటి వీడియోలు చూసినపుడు చాలా ధైర్యం వస్తుంది``, ``ఇది నిజంగా గొప్ప వీడియో``, ``బాల్యంలోనే అలాంటి స్వచ్ఛమైన స్నేహం ఏర్పడుతుంది``, ``అలాంటి స్నేహితులను కలిగిన ఆ కుర్రాడు నిజంగా గొప్ప వీరుడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: కారులో అత్తారింటికి వధూవరులు.. కారులో వరుడు చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Viral Video: పెళ్లి మండపం నుంచి పారిపోతున్నాడా? రోడ్లపై ఆ వరుడు ఎందుకలా తిరుగుతున్నాడంటే..
Viral Video: తెలివి చూస్తే ఔరా అనాల్సిందే కానీ, బట్టలు కుట్టడం కోసం అంత ఖర్చు అవసరమా..?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..