Share News

Viral: వయనాడ్‌లో విలయాన్ని ముందే పసిగట్టిన ‘కింగిణి’

ABN , Publish Date - Aug 06 , 2024 | 11:15 AM

ప్రకృతి సృష్టించే విపత్తులను పశుపక్ష్యాదులు ముందే గుర్తిస్తాయా? అంటే గతంలో సైతం ఇదే అంశంపై చర్చ జరిగింది. 2004లో సునామీ సంభవించింది. అయితే ఈ విషయాన్ని నాడు శునకాలు సైతం పసిగట్టాయంటూ ఓ ప్రచారం అయితే గట్టిగా సాగిన విషయం అందరికి తెలిసిందే.

Viral: వయనాడ్‌లో విలయాన్ని ముందే పసిగట్టిన ‘కింగిణి’

సహజ ప్రకృతికి అసలు సిసలు చిరునామా కేరళ. అలాంటి కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో ముండుక్కై, చూరల్మలలో జులై 30వ తేదీన ప్రకృతి సృష్టించిన విపత్తు అంత ఇంత కాదు. ఈ విపత్తు కారణంగా వందలాది మంది మరణించారు. ఎంతో మంది గాయపడ్డారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఈ ప్రమాదం నుంచి తమతోపాటు తమ ఇరుగు పోరుగు వారిని రామచిలుక కాపాడిందని చూరల్మల వాసి వినోద్ తెలిపారు.

Bangladesh Turmoil: కేంద్రానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ మద్దతు


తాము రామచిలుకను పెంచుకుంటున్నామన్నారు. ఈ చిలుకకు కింగిణి అని ముద్దు పేరు పెట్టుకున్నామని చెప్పారు. అయితే వయనాడులో ఈ ప్రకృతి విపత్తు సంభవించే ముందు రోజు. ఇంకా చెప్పాలంటే రెండో కొండ చరియ విరిగి పడే ముందు రోజు. ఈ రామచిలుక చేసిన హడావుడి మూములుగా లేదన్నారు. పంజరంలో ఉన్న కింగిణి బిగ్గరగా అరవడం ప్రారంభించిందని తెలిపారు. అలా చాలా సేపు అరవడమే కాకుండా.. పంజరాన్ని సైతం గట్టిగా కాలుతో తన్నడం ఆరంభిందన్నారు.

Also Read: Uttar Pradesh: 80 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన


దీంతో పొరుగు ఇళ్లలో నిద్ర పోతున్న జిజిన్, ప్రశాంత్, అక్షర్‌లను పిలవడంతో వారంతా ఉరుకులు పరుగులతో తమ నివాసానికి వచ్చారని చెప్పారు. అలా రామచిలుక విపరీతమైన ధోరణితో వ్యవహారిస్తున్న తీరును వారికి వివరించామన్నారు. దీంతో ఏదో కీడు జరగబోతుందనే విషయం తమకు స్పూరణకు వచ్చిందని పేర్కొన్నారు. దాంతో తాము ఇళ్లు ఖాళీ చేసి మరో ప్రాంతంలో ఉంటున్న తన సోదరి నంద నివాసానికి వెళ్లిపోయామన్నారు. అలాగే ఇరుగు పొరుగు వారు సైతం తమ తమ ఇళ్లును వదిలి తెలిసిన వారి ఇళ్లకు చేరుకున్నారన్నారు. దీంతో వారంతా ప్రాణాలతో భయటపడ్డారని సోదాహరణగా వివరించారు.

Also Read: Gold Rates Today: తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి ధర.. ఎంతంటే?


సునామీ సమయంలో సైతం..

ప్రకృతి సృష్టించే విపత్తులను పశుపక్ష్యాదులు ముందే గుర్తిస్తాయా? అంటే గతంలో సైతం ఇదే అంశంపై చర్చ జరిగింది. 2004లో సునామీ సంభవించింది. అయితే ఈ విషయాన్ని నాడు శునకాలు సైతం పసిగట్టాయంటూ ఓ ప్రచారం అయితే గట్టిగా సాగిన విషయం అందరికి తెలిసిందే. ప్రకృతితో మమేకమై పశుపక్ష్యాదులు జీవిస్తాయి. దీంతో ప్రకృతి ఇచ్చే సూచనలను ముందు పసిగడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.


308 మంది మృతి.. కొనసాగుతున్న సహయక చర్యలు..

కేరళలో చోటు చేసుకున్న ఈ ఘోర విపత్తులో మరణించిన వారి సంఖ్య.. అది ప్రభుత్వ లెక్కల ప్రకారం 308గా ఉంది. ఇప్పటికి 220 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమైనాయి. ఇంకా మరిన్ని మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. వాటి కోసం ఆర్మీ, నేవి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక సహాయక చర్యల్లో భాగంగా వయనాడ్‌లో భారీగా క్యాంపులు ఏర్పాటు చేశారు. వేలాది మందిని ఆ సహాయ శిబిరాలకు తరలించిన విషయం విధితమే.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 06 , 2024 | 11:49 AM