Share News

Viral Video: ఆహా.. వాడకంలో ఈమెను మించిన వాళ్లు లేరు.. మైక్రోవేవ్‌ను ఎలా మార్చేసిందో చూడండి..

ABN , Publish Date - Jun 11 , 2024 | 03:26 PM

బ్రెయిన్ ఉండాలే గానీ, ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా మన అవసరానికి ఉపయోగించుకోవచ్చు. పాడైపోయిన వస్తువునైనా ఏదో పనికి వాడుకోవచ్చు. క్రియేటివిటీతో ఇతురులను నివ్వెరపరచ్చవచ్చు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ తెలివితేటలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

Viral Video: ఆహా.. వాడకంలో ఈమెను మించిన వాళ్లు లేరు.. మైక్రోవేవ్‌ను ఎలా మార్చేసిందో చూడండి..
Microwave as Mail Box

బ్రెయిన్ ఉండాలే గానీ, ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా మన అవసరానికి ఉపయోగించుకోవచ్చు. పాడైపోయిన వస్తువునైనా ఏదో పనికి వాడుకోవచ్చు. క్రియేటివిటీ (Creativity)తో ఇతురులను నివ్వెరపరచ్చవచ్చు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ తెలివితేటలు (Intelligence) చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. పాడైపోయిన మైక్రోవేవ్‌ను అలా ఉపయోగించవచ్చని తెలుసుకుని చాలా మంది నెటిజన్లు షాకవుతున్నారు. ఆ జుగాడ్ వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది (Viral Video).


upworthy అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోను అమెరికాలోని న్యూయార్క్‌లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఆ వీడియోలో ఇంటి ముందు ఓ అందమైన తోట ఉంది. ఆ తోట మధ్యలో ఓ మెయిల్ బాక్స్ (Mail Box) ఉంది. అంటే ఉత్తరాలు, పార్సిళ్లు ఏవైనా తెచ్చిన వాళ్లు అందులో వేసేస్తే సరిపోతుంది. సాధారణంగా అలాంటి వాటి కోసం ప్రత్యేకంగా బాక్సులు ఉంటాయి. కానీ, ఓ బామ్మ పాడైపోయిన మైక్రోవేవ్‌ను (Microwave) మెయిల్ బాక్స్ స్థానంలో ఉంచింది. స్విచ్ నొక్కి లోపల ఉన్న లెటర్స్‌ను తీసుకెళ్తోంది. ఈ వీడియోలోని బామ్మ తెలివితేటలు చాలా మందిని షాక్‌కు గురి చేస్తున్నాయి.


ఈ వీడియో సోషల్ మీడియాలోని చాలా మందిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 46 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.7 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మెయిల్‌క్రోవేవ్``, ``క్రియేటివిటీ క్వీన్``, ``ఇది హాట్ మెయిల్``, ``రియూజ్, రీసైకిల్‌కు నిజమైన అర్థం ఇదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కోతులు నిజమైన యాక్షన్ హీరోలు.. ఎలక్ట్రిక్ వైర్లతో పెద్ద బిల్డింగ్‌లపై సాహసం..!


Viral Video: తెలివి అంటే ఇదీ.. ఈ ఇటుక కూలర్ ముందు ఏసీ కూడా బలదూర్.. ఎలా సెట్ చేశాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2024 | 03:26 PM