Share News

Viral: అదృష్టవంతుడంటే ఈ కూలీనే.. రూ.60తో కోట్లు సంపాదించాడు

ABN , Publish Date - Oct 18 , 2024 | 03:18 PM

కొందరికి అదృష్టం ఏ రూపంలో, ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. అప్పటివరకు కడు పేదరికంలో గడుపుతున్న వ్యక్తి అకస్మాత్తుగా కోటీశ్వరుడు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

Viral: అదృష్టవంతుడంటే ఈ కూలీనే.. రూ.60తో కోట్లు సంపాదించాడు

ఇంటర్నెట్ డెస్క్: కొందరికి అదృష్టం ఏ రూపంలో, ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. అప్పటివరకు కడు పేదరికంలో గడుపుతున్న వ్యక్తి అకస్మాత్తుగా కోటీశ్వరుడు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఉత్తరప్రదేశ్ ఆస్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంగపారాలో బంచరోన్ మేటే అనే కూలీ నివసిస్తున్నాడు. అతడికి స్వల్ప విస్తీర్ణంలో భూమి ఉంది. అందులో పలు రకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. అయితే దసరా రోజు బుర్ద్వాన్‌ గ్రామంలో ఎరువులు కొనడానికి వెళ్లాడు. లక్ష్మీపూజ కారణంగా ఫర్టిలైజర్ దుకాణం మూతపడటంతో ఆయన నిరాశగా తిరుగుపయనమయ్యాడు.


“షాప్ మూసేసినందుకు నేను నిరాశకు గురయ్యాను. నా భార్య ఇచ్చిన డబ్బులతో రెండు రోజువారీ లాటరీ టిక్కెట్లు కొన్నా. ఆమె ఎరువుల కోసం ఇచ్చిన రూ.100 నుంచి రూ.60 ఖర్చు చేశాను. ఇంటికి తిరిగి వచ్చాక డబ్బు ఖర్చు చేసినందుకు నా భార్య కదమ్ నన్ను మందలించింది" అని మేటే తెలిపాడు. అనంతరం రోజువారీ లాటరీ వెబ్ సైట్ ను ఆయన క్యాజువల్ గా తనిఖీ చేశాడు. అంతే ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అతడి టిక్కెట్‌లోని నంబర్ మొదటి బహుమతి విజేతతో సరిపోలడం చూసి ఆశ్చర్యపోయాడు. "నేను మొదట నా సెల్‌ఫోన్ స్క్రీన్‌పై చూస్తున్నదాన్ని నమ్మలేకపోయాను. నా భార్యకు ఈ విషయం చెప్పే ముందు నేను ఆ నంబర్ను చాలా సార్లు చెక్ చేశాను. లక్కీ విజేత నేనే అని తెలియడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. టిక్కెట్‌ను ఎవరైనా దొంగిలించవచ్చనే భయంతో నా మేనల్లుడికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ లో భద్రత పొందాను" అని మేటే చెప్పాడు. రూ.60తో రెండు లాటరీ టికెట్లు కొనగా.. అందులో ఒక లాటరీ లక్కీగా తగలడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. రూ.కోటిపైన ఆయన నగదును బహుమతిగా గెలుచుకున్నాడు. అదృష్టమంటే అతనిదే కదా..

Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..

Updated Date - Oct 18 , 2024 | 03:19 PM