Share News

Viral Video: షాకింగ్ వీడియో.. నడి సముద్రంలో బోటుపై తిమింగళం దాడి.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..!

ABN , Publish Date - Jul 24 , 2024 | 10:36 AM

ప్రశాంతంగా ఉన్న సముద్రం.. నీటిపై హాయిగా వెళ్తున్న బోటు.. ఇంతలో ఉన్నట్టుండి గందరగోళం.. ఓ భారీ తిమింగళం నీటి అడుగు నుంచి ఒక్కసారిగా పైకి దూసుకొచ్చింది.. ఆ బోటుపై దాడి చేసి సముద్రంలో పడేసింది.. ఇదంతా ఏదో హాలీవుడ్ సినిమాలో సీన్ అనుకుంటున్నారా?

Viral Video: షాకింగ్ వీడియో.. నడి సముద్రంలో బోటుపై తిమింగళం దాడి.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..!
Whale lands on boat

ప్రశాంతంగా ఉన్న సముద్రం (Sea).. నీటిపై హాయిగా వెళ్తున్న బోటు (Boat).. ఇంతలో ఉన్నట్టుండి గందరగోళం.. ఓ భారీ తిమింగళం (Whale) నీటి అడుగు నుంచి ఒక్కసారిగా పైకి దూసుకొచ్చింది.. ఆ బోటుపై దాడి చేసి సముద్రంలో పడేసింది(Whale attacks boat) .. ఇదంతా ఏదో హాలీవుడ్ సినిమాలో సీన్ అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే.. అమెరికా (USA)లోని న్యూ హాంప్‌షైర్ వద్ద ప్రోట్స్‌మౌత్ సముద్ర జలాల్లో నిజంగానే జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


న్యూ హాంప్‌షైర్‌కు సమీపంలోని సముద్ర జలాల్లోకి కొందరు వ్యక్తులు చేపల వేట కోసం 23 అడుగుల బోటుతో వెళ్లారు. ఆ సమయంలో ఓ భారీ తిమింగళం ఆ బోటు సమీపానికి వచ్చింది. పైకి ఎగిరి ఆ బోటు మీద పడింది. ఆ దెబ్బకు ఆ బోటు నీటిలో పడిపోయింది. ఆ బోటులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు ముందుగానే సముద్రంలోకి దూకేయగా, మరొకరు తిమింగళం ఢీకొట్టడంతో సముద్రంలో పడిపోయారు. ఆ ఘటన మొత్తాన్ని సమీపంలో ఉన్న వేరే బోటులోని వ్యక్తులు వీడియో తీశారు.


సముద్రంలో పడిపోయిన ఆ ఇద్దరు వ్యక్తులను కాపాడారు. ఈ ఘటనలో ఆ తిమింగళానికి కూడా ఎటువంటి హానీ జరగలేదు. న్యూ హాంప్‌షైర్‌ జలాల్లో జూన్ నుంచి ఆగస్ట్ వరకు తిమింగళాల సంచారం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అవి సముద్రంలోకి వచ్చి బోట్‌లకు ఎలాంటి హానీ కలిగించవు. ప్రస్తుత ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1.4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించి, స్పందించారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: హాస్పిటల్ బెడ్ మీదున్న యజమాని.. పాకుతూ వచ్చిన ఏనుగు ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!


Passport: ప్రపంచంలో పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌లు ఇవే.. భారత పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందంటే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 24 , 2024 | 10:36 AM