Share News

Viral Video: ఈమె సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్.. వాషింగ్ మెషిన్ పాడైందని బట్టలు ఎలా ఉతుకుతోందో చూడండి..

ABN , Publish Date - Dec 17 , 2024 | 08:37 PM

ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ వాషింగ్ మెషిన్ లేకపోవడంతో వేరే విధంగా బట్టలు ఉతుకుతోంది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Viral Video: ఈమె సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్.. వాషింగ్ మెషిన్ పాడైందని బట్టలు ఎలా ఉతుకుతోందో చూడండి..
jugaad trick

మన దేశంలో సాధారణ గృహిణులు కూడా అద్భుతమైన తెలివితేటలను (Intelligence) ఉపయోగిస్తారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. ఆ క్రమంలో వారు చేసే ట్రిక్‌లు చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇప్పటికే అలాంటి జుగాడ్ వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ వాషింగ్ మెషిన్ లేకపోవడంతో వేరే విధంగా బట్టలు ఉతుకుతోంది (Washing). ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


orinbabokk91 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వాషింగ్ మెషిన్ పాడవడంతో ఆమె సర్ఫ్ నిండిన నీళ్లు ఉన్న టబ్‌లో బట్టలు వేసింది. వాటిని ఉతకడానికి ఇంటిని క్లీన్ చేయడానికి ఉపయోగించే మాఫ్ మెషిన్‌ను (floor mop Machine) వాడింది. ఆ బట్టలను మాఫ్ మెషిన్‌లో వేసి పైన స్టిక్‌తో నొక్కింది. దీంతో బట్టల నుంచి నీరు బయటకు పోయి శుభ్రం అయిపోతున్నాయి. ఆమె ఐడియాను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది వీక్షించారు. 2.2 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వావ్.. మాఫ్ మెషిన్‌ను అలా కూడా ఉపయోగించవచ్చా``, ``ఆమె బ్రెయిన్‌కు సలాం కొట్టాల్సిందే``, ``చాలా మంచి ఆలోచన``, ``టైం చాలా ఎక్కువ పడుతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral News: ఒక్క ముద్దు.. ఆమెను చావు అంచుల వరకు తీసుకెళ్లింది.. ఆమె చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే..


Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే.. 19 ఏళ్ల బాలుడిని గ్రైండర్‌ ఏం చేసిందో చూడండి..


Viral Video: రామ.. రామ.. ఇదెక్కడి దారుణం.. హనుమాన్ ఛాలీసాకు బార్ గర్ల్స్ డ్యాన్స్ చూస్తే..


Viral Video: అదృష్టం అంటే ఇతడిదే.. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఎలా బయటపడ్డాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 17 , 2024 | 08:37 PM