Share News

ఎక్కడ కొంటామంటే...

ABN , Publish Date - Dec 15 , 2024 | 07:03 AM

ఒకరకంగా డిసెంబర్‌ షాపింగ్‌ నెల. మార్కెట్లో డిస్కౌంట్ల ధగధగలు మెరిసిపోతాయి కాబట్టి... సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా షాపింగ్‌ చేసేందుకు ఉత్సాహం చూపుతారు. ఇంతకీ ‘మీరు షాపింగ్‌ ఎక్కడ చేస్తారు?’ అంటూ కొందరు తారలను సరదాగా అడిగితే... వాళ్లు చెప్పిన షాపింగ్‌ ముచ్చట్లివి...

ఎక్కడ కొంటామంటే...

ఒకరకంగా డిసెంబర్‌ షాపింగ్‌ నెల. మార్కెట్లో డిస్కౌంట్ల ధగధగలు మెరిసిపోతాయి కాబట్టి... సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా షాపింగ్‌ చేసేందుకు ఉత్సాహం చూపుతారు. ఇంతకీ ‘మీరు షాపింగ్‌ ఎక్కడ చేస్తారు?’ అంటూ కొందరు తారలను సరదాగా అడిగితే... వాళ్లు చెప్పిన షాపింగ్‌ ముచ్చట్లివి...

స్ట్రీట్‌ షాపింగ్‌ ఇష్టం

షాపింగ్‌ నాకొక స్ట్రెస్‌బస్టర్‌. మనసు బాగోకపోయినా లేదా షూటింగ్స్‌లో కాస్త విరామం దొరికినా షాపింగ్‌కి సిద్ధమవుతా. నా ఫేవరెట్‌ షాపింగ్‌ డెస్టినేషన్‌ అంటే ముంబైలోని సరోజినీనగర్‌. స్ట్రీట్‌ షాపింగ్‌ చేయడానికే ఇష్టపడతా. దుస్తులు, షూ, హ్యాండ్‌బ్యాగ్స్‌ కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చుపెడుతుంటా. నాకు సాధారణంగా కనిపించడమంటే ఇష్టం. మీరు నమ్ముతారో లేదో గానీ అత్యంత ఖరీదైనవే కాదు... ఐదొందల రూపాయల దుస్తులు కూడా ధరిస్తుంటా.

- శ్రద్ధాకపూర్‌


నచ్చితేనే కొంటా

book2.jpg

నాతో షాపింగ్‌ అంటే మామూలుగా ఉండదు. బాగా నచ్చితేగానీ కొనను. షాపింగ్‌ ఉదయం మొదలైతే రాత్రికి పూర్తవుతుంది. కొనేవి ఒకటీ, రెండే అయినా అంత సమయం తీసుకుంటా. అందుకే నాతో షాపింగ్‌ అంటే అంతా భయపడతారు. నా షాపింగ్‌ డెస్టినేషన్‌... న్యూయార్క్‌. ఏం కొనాలన్నా వెంటనే అక్కడ వాలిపోతా. షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వెళితే... ముఖానికి స్కార్ఫ్‌ చుట్టుకొని చార్మినార్‌ వీధుల్లో షాపింగ్‌ చేస్తుంటా.

- కియారా అద్వానీ


చీరలకే ఓటు

book1.4.jpg

నా డ్రెస్సింగ్‌ స్టైల్‌ బాగుంటుందని చాలామంది అంటుంటారు. దుస్తుల దగ్గర నుంచి యాక్సెసరీల దాకా అన్నింట్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. ఫ్యాషన్‌ విషయంలో అస్సలు రాజీ పడను. ఎక్కువగా లాస్‌ ఏంజిల్స్‌లో షాపింగ్‌ చేస్తుంటా. అక్కడ నాకు కావాల్సిన బ్రాండ్స్‌ అన్నీ దొరుకుతాయి. డిజైనర్‌వేర్‌ షాపింగ్‌ అంతా అక్కడే చేస్తుంటా. మన దగ్గరైతే నా ఓటు దిల్లీకే. చీరలంటే ఇష్టం. చీరల్ని కాస్త భిన్నంగా కట్టుకోవడానికి ఇష్టపడతా. షాపింగ్‌ చేస్తున్నంత సేపూ నా కళ్లు ఆకుపచ్చ రంగు దుస్తులపైనే ఉంటాయి.

- సోనమ్‌కపూర్‌


చలో దుబాయ్‌...

book1.2.jpg

ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఎన్ని ఉన్నా... నేరుగా షాపులోకి వెళ్లి బేరమాడి, కొనుక్కోవడంలో ఉన్న మజానే వేరు. అందుకే ఏం కావాలనుకున్నా దుబాయి విమానం ఎక్కేస్తా. షాపింగ్‌లో నాకసలు సమయమే తెలీదు. అక్కడి కలెక్షన్‌ బాగా నచ్చుతుంది. అందుకే ముఖ్యమైన ఈవెంట్‌ ఉంటే వెంటనే దుబాయ్‌ మాల్‌కి వెళ్లి... పెద్ద మొత్తంలో షాపింగ్‌ చేసుకుని వచ్చేస్తా.

- జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

Updated Date - Dec 15 , 2024 | 07:03 AM