Share News

Viral Video: రావణుడిని చంపింది ఎవరు.. టీచర్ ప్రశ్నకు ఈ కుర్రాడి సమాధానం వింటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే..

ABN , Publish Date - Oct 18 , 2024 | 12:31 PM

పిల్లల ఆల్లరి మాటలు వింటే ఎంతో నవ్వు వస్తుంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. క్లాస్ రూమ్‌లో టీచర్ అడిగిన ప్రశ్నకు ఓ కుర్రాడి సమాధానం వింటే నవ్వుకోవాల్సిందే.

Viral Video: రావణుడిని చంపింది ఎవరు.. టీచర్ ప్రశ్నకు ఈ కుర్రాడి సమాధానం వింటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే..
Boy funny answer to teacher`s question

చిన్న పిల్లల అల్లరి, కల్మషం లేకుండా అమాయకంగా మాట్లాడే మాటలు చాలా మందికి నవ్వు తెప్పిస్తాయి. పిల్లలతో కాసేపు గడిపితే ఈ ప్రపంచాన్నే మర్చిపోవచ్చు అని చెబుతుంటారు. వాళ్ల ఆల్లరి మాటలు వింటే ఎంతో నవ్వు వస్తుంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. క్లాస్ రూమ్‌లో టీచర్ అడిగిన ప్రశ్నకు ఓ కుర్రాడు (Boy) చెప్పిన సమాధానం వింటే నవ్వుకోవాల్సిందే. ``రావణుడిని చంపింది ఎవరు`` (who killed Ravana) అని పిల్లలను టీచర్ (Teacher) అడిగితే.. ఆ కుర్రాడు అమాయకంగా చెప్పిన సమాధానం చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@aachary_shailendr0216 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. క్లాస్‌రూమ్‌లో టీచర్ ఓ బాలుడిని పిలిచి ``రావణుడిని చంపింది ఎవరు`` అని అడిగారు. దానికి ఆ కుర్రాడు భయపడుతూ.. ``నేను కాదు సర్. ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను. నేను మంచినీళ్లు తాగడానికి వెళ్లాను`` అని చెప్పాడు. పక్కనే ఉన్న మరో కుర్రాడిని చూపించి.. ``నేను చంపలేదు. ఆ కుర్రాడే చంపాడు`` అని నమ్మకంగా చెప్పాడు. ఆ కుర్రాడి సమాధానం విని టీచర్ అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల మంది వీక్షించారు. 22 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``రావణుడిని నేను కూడా చంపలేదు``, ``బ్యాక్ బెంచ్ స్టూడెంట్``, ``ఆ కుర్రాడు ప్రమాణం చేస్తున్నాడు.. నిజంగానే చంపి ఉండడు``, ``ఎంత అమాయకంగా చెబుతున్నాడో``, ``రావణుడిని నేను చంపాను`` అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Yahya Sinwar: ఎవరీ యహ్వా సిన్వర్.. ఇజ్రాయెల్ కాల్పులో మరణించిన హమాస్ అగ్రనేత కథ ఏంటి?


Viral Video: ఇదెక్కడి వింత బైక్.. బైక్‌కు ట్రాక్టర్ చక్రం అమర్చి రోడ్డుపై రైడ్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..


Viral: బాబోయ్.. అది దెయ్యం ఇల్లా.. ఏలియన్స్ స్థావరమా? అంటార్కిటికా మంచులో భారీ తలుపు.. నెటిజన్ల కామెంట్లు..


Optical Illusion: మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో తేడాగా ఉన్న తాళం చెవిని 11 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: వావ్.. వాటే ట్యాలెంట్.. ఈ కుర్రాడి ట్యాలెంట్ చూస్తే ఆశ్చర్యంతో షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 18 , 2024 | 12:31 PM