Solar Eclipse 2024: నేటి సూర్యగ్రహణం ఎందుకంత అరుదైనది?.. దీని వెనుకున్న అసలు కారణాలు ఇవే!
ABN , Publish Date - Apr 08 , 2024 | 01:03 PM
ప్రస్తుత ఏడాది 2024లో ఈ రోజు (సోమవారం) తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇండియాలో ఈ గ్రహణం కనిపించే అవకాశం లేకపోయినప్పటికీ.. ఉత్తర అమెరికా దేశాలు, మెక్సికో, అమెరికా, కెనడా దేశాల్లో ఖగోళ ఔత్సాహికులకు కనువిందు చేయనుంది. నేడు ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణమే అయినప్పటికీ చాలా అరుదైనదని, దాదాపు మరో 400 సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుతం జరగనుందని ఖగోళ శాస్త్రజ్ఞలు చెబుతున్నారు.
ప్రస్తుత ఏడాది 2024లో ఈ రోజు (సోమవారం) తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇండియాలో ఈ గ్రహణం కనిపించే అవకాశం లేకపోయినప్పటికీ.. ఉత్తర అమెరికా దేశాలు, మెక్సికో, అమెరికా, కెనడా దేశాల్లో ఖగోళ ఔత్సాహికులకు కనువిందు చేయనుంది. నేడు ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణమే అయినప్పటికీ చాలా అరుదైనదని, దాదాపు మరో 400 సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుతం జరగనుందని ఖగోళ శాస్త్రజ్ఞలు చెబుతున్నారు. మరి ఈ సూర్య గ్రహణం ఎందుకంత అరుదు?.. ఏమిటా ప్రత్యేకం?. ఆసక్తికరమైన విషయాలను పరిశీలిద్దాం..
సూర్యుడు, చంద్రుడు, భూమి నిర్ధిష్టమైన ఒకే సరళ రేఖపైకి రావడం ఈ సంపూర్ణ సూర్యగ్రహణం విశిష్ఠత అని నాసా (NASA) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణ సమయంలో భూమి, సూర్యుడి మధ్య చంద్రుడు వస్తాడని పేర్కొన్నారు. సూర్య కాంతి భూమిపై పండకుండా చంద్రుడు అడ్డుకుంటాడని చెబుతున్నారు. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే కక్ష్యతో పోలిస్తే.. భూమి చుట్టూ చంద్రుడి కక్ష్య కొద్దిగా వంగి ఉంటుందని, ఇలాంటి అమరిక చాలా అరుదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ఆకాశం చీకటిగా మారిపోతుందని, తెల్లవారుజాము లేదా సంధ్యా సమయాన్ని గుర్తు చేస్తుందని అంటున్నారు. వాతావరణంగా అనుకూలంగా ఉంటే ఖగోళ ఔత్సాహికులు ప్రత్యేక పరికరాల ద్వారా సూర్యుడి ప్రధాన భాగాన్ని చూడొచ్చని, సూర్యకాంతి ప్రకాశం కారణంగా సాధారణ పరిస్థితుల్లో దీనిని చూడలేమని నాసా శాస్త్రవేత్తలు వివరించారు.