Gmail: జీమెయిల్ సర్వీసుకు ఫుల్ స్టాప్ పడనుందా? నెట్టింట రేగుతున్న కలకలం..!
ABN , Publish Date - Feb 23 , 2024 | 05:32 PM
జీమెయిల్ సర్వీసుకు గూగుల్ ముగింపు పలకనుందంటూ ఇటీవల ఓ వార్త నెట్టింట పెనుకలకాలనికే దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: జీమెయిల్ సర్వీసుకు (Gmail) గూగుల్ ముగింపు పలకనుందంటూ (Service to be Discontinued) ఇటీవల ఓ వార్త నెట్టింట పెనుకలకాలనికే దారి తీసింది. చూస్తుండగానే ఈ వదంతి వైరల్ (Viral) కావడంతో చివరకు గూగుల్ (Google) స్వయంగా స్పందించాల్సి వచ్చింది.
ఇంటి నుంచే పని చేస్తున్న భార్య.. ఆమె తన కోలీగ్స్‌తో ఫోన్లో మాట్లాడుతుంటే సీక్రెట్‌గా విని..
అసలేం జరిగిదంటే..
జీమెయిల్ ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అన్న విషయం తెలిసిందే. అయితే, జీమెయిల్ మూసేయనున్నారంటూ ఈ మధ్య కాలంలో నెట్టింట ఓ ఫేక్ ఇమేజ్ వైరల్‌గా (Viral) మారింది. ఇది నిజమనే అనుకున్న చాలా మంది భయపడిపోయారు. వరుస పెట్టి కామెంట్లు చేయడంతో చూస్తుండగానే ఈ వార్త వైరల్‌గా మారింది. చివరకు గూగుల్ దృష్టిలోకి కూడా వెళ్లింది.
Anand Mahindra: ఎంత మంచి మనసు తల్లీ నీది! ఈ బాలిక గొప్పతనం తెలిసి ఆనంద్ మహీంద్రానే ఫిదా!
కానీ, అలాంటి ఆలోచనే తమకు లేదని గూగుల్ తాజాగా స్పష్టం చేసింది. జీమెయిల్ సర్వీసు ఎలప్పుడూ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. అయితే ఈ సర్వీసులో ఓ కీలక మార్పు జరుగుతుందని వెల్లడించింది. కంపెనీ ప్రకటన ప్రకారం, ఇకపై జీమెయిల్‌కు సంబంధించి బేసిక్ హెచ్‌టీఎమ్ఎల్ వర్షన్ అందుబాటులో ఉండదు (Basic Html Service stopped).
ఎటువంటి హంగూఆర్భాటం లేని జీమెయిల్ బేసిక్ వర్షన్‌లో చాట్, స్పెల్ చెక్, రిచ్ ఫార్మాటింగ్ ఫీచర్లు వంటివేవీ ఉండేవి కావు. ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వర్షన్ అందుబాటుులో ఉండేది. ఈ వర్షన్‌ను ముగిస్తున్నట్టు గూగుల్ గతేడాదే ప్రకటించింది. అన్నట్టుగానే.. గత నెలలోనే ముగింపు పలికింది. ఈ నేపథ్యంలోనే జీమెయిల్ సర్వీసులు కూడా కనుమరుగవుతాయన్ని వార్త వైరల్ కావడంతో సంస్థ ఈ కీలక ప్రకటన చేసింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి