Share News

Viral: అక్కడ సీన్ రివర్స్.. భార్యలే తమ భర్తలకు.. ఇదేదో బాగుందే!

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:53 PM

సాధారణంగా భర్తలు తాము సంపాదించిన కష్టార్జితాన్ని భార్యల చేతుల్లో పెడుతుంటారు. కాకపోతే.. తమ ఖర్చులకు కావాల్సిన కొంత డబ్బు తీసుకొని, మిగిలిన మొత్తాన్ని ఇంటి ఖర్చులకు గాను భార్యలకు ఇస్తారు.

Viral: అక్కడ సీన్ రివర్స్.. భార్యలే తమ భర్తలకు.. ఇదేదో బాగుందే!
Viral News

సాధారణంగా భర్తలు తాము సంపాదించిన కష్టార్జితాన్ని భార్యల చేతుల్లో పెడుతుంటారు. కాకపోతే.. తమ ఖర్చులకు కావాల్సిన కొంత డబ్బు తీసుకొని, మిగిలిన మొత్తాన్ని ఇంటి ఖర్చులకు గాను భార్యలకు ఇస్తారు. ఈ సంప్రదాయం ఒక్క భారత్‌లోనే కాదు.. కొన్ని తరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ వస్తోంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ కలిసి సంపాదిస్తే.. తమ పాకెట్ మనీ కోసం కొంత డబ్బు తీసుకొని, మిగిలింది ఇంటి ఖర్చులకు కేటాయిస్తారు. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటారు. అయితే.. జపాన్‌లో (Japan) మాత్రం ఇందుకు భిన్నంగా ఒక ఆచారం కొనసాగుతోంది.


భార్యలే తమ భర్తలకు..

జపాన్‌లోని ఓ ప్రాంతంలో భర్తలు తాము సంపాదించే మొత్తాన్ని భార్యల చేతుల్లో పెడతారు. అందులో సేవింగ్స్ సహా ఇంటి ఖర్చులయ్యే డబ్బులను పక్కన పెట్టేసి.. కొంత మొత్తాన్ని పాకెట్ మనీగా భర్తలకు ఇస్తారు. భార్యలు ఎంత డబ్బు ఇస్తారో, అంతే మొత్తాన్ని భర్తలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని అక్కడ ‘కొజుకై’ (Kozukai) అని అంటారు. అనవసరమైన ఖర్చులు చేయకుండా, డబ్బును ఆదా చేయడం కోసమే ఈ పద్ధతిని వాళ్లు అనుసరిస్తున్నారు. అలాగే.. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుందని, పారదర్శకత పెరుగుతుందనేది వారి నమ్మకం. ఓ నివేదిక ప్రకారం.. జపాన్‌లో 74 శాతం మంది మహిళలు ఓవైపు ఇంటి పనులు చూసుకుంటూ, మరోవైపు డబ్బులను ఆదా చేస్తున్నారు. భర్తల ఖర్చులను అదుపు చేసేందుకు అక్కడి భార్యలు మరికొన్ని పద్ధతుల్ని కూడా ఫాలో అవుతుంటారని తెలిసింది.


అసలు కారణం ఇదే..

ఈ అంశంపై యోషిహిరో నోజావా(36) అనే ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తాను ప్రతినెలా తన కష్టార్జితాన్ని భార్యకు ఇస్తానని, అందులో నుంచి అన్ని ఖర్చులు పోగా కొంత మొత్తాన్ని భార్య తనకు పాకెట్ మనీ ఇస్తుందని తెలిపాడు. అనవసరమైన ఖర్చులను అరికట్టడంతో పాటు ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నాడు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల ఇప్పుడు తన పాకెట్ మనీ కూడా బాగా పెరిగిందని చెప్పాడు. ఇదే సమయంలో అతని భార్య మాట్లాడుతూ.. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. తమకు పెళ్లైనప్పటి నుంచే ఇంటి ఆర్థిక నిర్వహణ బాధ్యతను తాను తీసుకున్నానని, ఖర్చులను తానే నిర్వహించడం మొదలుపెట్టానని తెలిపింది. ఫలితంగా.. తాము చాలా డబ్బు ఆదా చేయగలిగామని ఆమె చెప్పుకొచ్చింది.


ఇది మంచి విధానమే..

జపాన్‌లో అనుసరిస్తున్న ఈ కొజుకై సంప్రదాయం నిజంగా మంచిదేనని చెప్పుకోవచ్చు. మగాళ్లు తమ పాకెట్ మనీని పరిమితం చేసుకోవడం.. ఇంటి ఖర్చులు తగ్గించుకోవడం వంటి పద్ధతులు పాటిస్తే.. అనవసరమైన ఖర్చులనేవి బాగా తగ్గుతాయి. దాంతో.. డబ్బులు ఆదా అవుతాయి. అప్పుడు అప్పుల బెడద కూడా ఉండదు. మరి.. దీనిపై మీరేమంటారు?

Read Latest Viral News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 03:53 PM