Share News

Viral: వధువు మేకప్ వేసుకుంటుండగా తుపాకీతో కాల్చి హత్య!

ABN , Publish Date - Jun 24 , 2024 | 09:50 PM

వధువు మేకప్ వేసుకుంటుండగా మాజీ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఆమెను హత్య చేసిన దారుణ ఘటన ఉత్తర్‌‌ప్రదేశ్‌లో వెలుగు చూసింది.

Viral: వధువు మేకప్ వేసుకుంటుండగా తుపాకీతో కాల్చి హత్య!

ఇంటర్నెట్ డెస్క్: వధువు మేకప్ వేసుకుంటుండగా మాజీ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఆమెను హత్య చేసిన దారుణ ఘటన ఉత్తర్‌‌ప్రదేశ్‌లో వెలుగు చూసింది. మరికొద్ది గంటల్లో వివాహం అనగా వధువు మరణించడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మధ్యప్రదేశ్ దాటియా జిల్లాకు చెందిన వధువు పెళ్లి కోసమని ఉత్తర్‌ప్రదేశ్ (Uttarpradesh) వచ్చిన సందర్భంగా ఆదివారం ఈ దారుణం జరిగింది.

Viral: స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్.. ప్యాకెట్ విప్పి చూస్తే..

ఆమె సెలూన్‌లో మేకప్ వేసుకుంటుండగా అక్కడికొచ్చిన మాజీ ప్రియుడు ఆమెకు బయటకు రమ్మని పెద్దపెట్టున కేకలు వేశాడు. ‘‘కాజల్ బయటకు రా.. నువ్వు నన్ను మోసం చేశావు’’ అంటూ నిందితుడు లోపలికి దూసుకొచ్చి ఆమెపై కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ‘‘మా సోదరి రెడీ అవుతుండగా అతడు వచ్చి బయటకు రమ్మని అరిచాడు. ఆమె నిరాకరించడంతో తలుపు పగలగొట్టి లోపలకు దూసుకొచ్చి తుపాకీతో కాల్చాడు’’ అని మృతురాలి సోదరి పేర్కొంది (Woman 22 Getting Ready For Her Wedding Day Shot Dead By Ex Boyfriend).


నిందితుడి పేరు దీపక్ అని మృతురాలి సోదరి తెలిపింది. అతడు తమ గ్రామానికి చెందిన వాడేనని వెల్లడించింది. ఓ బ్యాగుతో అతడు సెలూన్ వద్దకు వచ్చాడని, ముఖానికి హ్యాండ్‌కర్చీఫ్ కూడా చుట్టుకున్నాడని పేర్కొంది. తనతో రమ్మని బలవంతం చేశాడని, తననెందుకు బెదదించావని ప్రశ్నించాడని తెలిపింది.

తీవ్ర గాయాల పాలైన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. నిందితుడు మృతురాలి స్వగ్రామానికి చెందిన వాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు తెలీకుండా అనుసరించి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 24 , 2024 | 09:52 PM