Share News

Viral: వింత వ్యసనం.. పెట్రోల్ తాగేందుకు అలవాటు పడ్డ మహిళ!

ABN , Publish Date - Jul 06 , 2024 | 10:55 PM

పెట్రోల్ తాగేందుకు అలవాటు పడ్డ ఓ యువతి అది లేకుండా పూట గడవదని చెబుతోంది. పొద్దున్నే ఓ టీస్పూ్న్ పెట్రోల్ తాగితే గానీ రోజును ప్రారంభించలేనని అంటోంది. పెట్రోల్ సేవనంతో తన డిప్రెషన్ కూడా నియంత్రణలో ఉంటోందని చెబుతోంది.

Viral: వింత వ్యసనం.. పెట్రోల్ తాగేందుకు అలవాటు పడ్డ మహిళ!

ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్ తాగేందుకు అలవాటు పడ్డ ఓ యువతి అది లేకుండా పూట గడవదని చెబుతోంది. పొద్దున్నే ఓ టీస్పూ్న్ పెట్రోల్ తాగితే గానీ రోజును ప్రారంభించలేనని అంటోంది. పెట్రోల్ సేవనంతో తన డిప్రెషన్ కూడా నియంత్రణలో ఉంటోందని చెబుతోంది. అంతేకాదు, పెట్రోల్ దుష్ఫ్రభావాల గురించి తెలిసినా మానలేకపోతున్నానని చెప్పింది (Viral).

Viral: పురుషుడి చెప్పులు గది బయట ఉంటే భద్రత! హోటల్స్‌లో ఒంటరి మహిళలకు సూచన


కెనడాలోని ఒంటారియోకు చెందిన షానన్‌కు చాలా చిన్నతనంలోనే పెట్రోల్ వాసన నచ్చింది. చివరకు పెద్దయ్యాక ఓ రోజు దాన్ని టేస్టు చేయాలన్న బుద్ధిపుట్టింది. అదే చివరకు ఈ వ్యసనానికి దారి తీసింది. ‘‘ఇది సేఫ్ కాదని తెలుసు. ఇది ఏదో రోజు నన్ను చంపేస్తుందనీ తెలుసు. కానీ నేను దీన్ని వదులుకోలేకపోతున్నాను. తీయ్యగా, పుల్లగా సాస్ తిన్నట్టు ఉంటుందీ పెట్రోల్. ఇది తాగగానే మొదట గొంతులో ఏదో చక్కిలిగిలిగా అనిపిస్తుంది. ఆ తరువాత కాస్త మండినట్టు అనిపిస్తుంది. ఇది లేకుండా నాకు పూట గడవదు. ఉదయాన్నే నేను పెట్రోల్ తాగుతాను. బయటకు ఎక్కడికి వెళ్లినా వెంట బాటిల్‌లో పెట్రోల్ తీసుకెళతాను’’ అని చెప్పింది. షానన్ రోజుకు 12 టీస్పూన్ల చొప్పున పెట్రోల్ తాగుతుంది. ఆ లెక్కన సంవత్సారినికి ఐదు గాలెన్లకు చొప్పున తాగుతోంది.

పెట్రోల్ తాగడం ప్రమాదకరమని వైద్యులు ఎప్పుడో హెచ్చరించారని షానన్ చెప్పింది. వైద్యుల ప్రకారం, పెట్రోల్‌తో పలు దుష్ఫరిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా కడుపులో తిప్పడం, వాంతులు వంటి స్వల్పకాలిక సమస్యలతో పాటు సుదీర్ఘకాలం పెట్రోల్ సేవనంతో మెదడు పూర్తిగా చెడిపోయి మరణం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 11:00 PM