Share News

Viral Video: ఇది వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్.. బైక్ మీద వెళ్తూ ఆన్‌లైన్ మీటింగ్‌కు అటెండ్ అవుతున్న మహిళ.. వీడియో వైరల్!

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:17 PM

ప్రస్తుత డిజిటల్ యగంలో వర్క్ కల్చర్ చాలా వరకు మారిపోయింది. ఎక్కడ ఉన్నా ఆన్‌లైన్ ద్వారా పని జరిగిపోతోంది. ఇక కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, జూమ్ మీటింగ్‌ల వంటివి ఎక్కువైపోయాయి. మరి, టెక్ హబ్ అయిన బెంగళూరులో చాలా మంది ఉద్యోగులు ఈ డిజిటల్ విప్లవాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు.

Viral Video: ఇది వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్.. బైక్ మీద వెళ్తూ ఆన్‌లైన్ మీటింగ్‌కు అటెండ్ అవుతున్న మహిళ.. వీడియో వైరల్!
peak bengaluru moment

ప్రస్తుత డిజిటల్ యగంలో వర్క్ కల్చర్ చాలా వరకు మారిపోయింది. ఎక్కడ ఉన్నా ఆన్‌లైన్ ద్వారా పని జరిగిపోతోంది. ఇక కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home), జూమ్ మీటింగ్‌ల వంటివి ఎక్కువైపోయాయి (Online Meeting). మరి, టెక్ హబ్ అయిన బెంగళూరు (Bengaluru)లో చాలా మంది ఉద్యోగులు ఈ డిజిటల్ విప్లవాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. బెంగళూరులో ట్రాఫిక్ ఓ స్థాయిలో ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మహిళ చేసిన పని చాలా మందిని ఆకట్టుకుంటోంది (Viral Video).


SHAAN SUNDAR అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో బెంగళూరులోని ఓ సిగ్నల్ దగ్గర వాహనాలు అన్నీ ఆగి ఉన్నాయి. అక్కడ స్కూటీ మీద వెళ్తున్న మహిళ జర్నీ చేస్తూనే ఆఫీస్‌కు సంబంధించిన ఆన్‌లైన్ మీటింగ్‌కు హాజరైంది. కారులో ఉన్న వ్యక్తి ఆమెను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ``వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్.. బెంగళూరులోని ఓ సాధారణ రోజు`` అంటూ కామెంట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Work from Traffic).


ఈ వీడియో వేల సంఖ్యలో వ్యూస్ సాధించింది. ఈ వీడియో ట్రాఫిక్ పోలీసుల దృష్టి వరకు వెళ్లింది. ఆ వీడియో ఎక్కడ తీశారో లోకేషన్ చెప్పాలని అడిగారు. అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బెంగళూరులో ఇలాంటివి సర్వ సాధారణమే``, ``బెంగళూరు వాసులు ఎలాంటి పరిస్థితిలోనైనా పని చేయాల్సిందే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని ఆరు ఆంగ్ల పదాలను కనిపెట్టండి!


Viral Video: గడ్డిలో దాక్కున్న జింక పిల్ల.. వాసన ద్వారా దానిని పులి ఎలా పసిగట్టిందో చూడండి.. వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 26 , 2024 | 12:17 PM