Viral: రోజుకు12 గంటలు పనిలోనే గడిపేస్తున్నా! మహిళ పోస్టుకు భారీ స్పందన
ABN , Publish Date - Jun 29 , 2024 | 10:43 PM
కార్పొరేట్ పని సంస్కృతి కారణంగా తాను రోజులో 12 గంటలు పనికే కేటాయిస్తున్నానని ఓ యువతి చెప్పింది. వ్యక్తిగత జీవితానికి టైం ఉండట్లేదని వాపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: కార్పొరేట్ ప్రపంచం మనిషిని పీల్చి పిప్పి చేస్తోంది. వ్యక్తిగత జీవితమేదే లేకుండా నేటి యువత పనికే పరిమితమైపోతోంది. ఓ యువతి తాజాగా పెట్టిన పోస్టు ఇందుకు ఉదాహరణగా నిలుస్తూ అనేక మందిని కదిలిస్తోంది. కార్పొరేట్ పని సంస్కృతి ఉద్యోగులకు ఊపిరాడకుండా చేస్తోందని అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, ఈ ఉదంతం నెట్టింట వైరల్ గా (Viral) మారింది.
Viral: ఎంతపని చేశాడీ డెలివరీ ఏజెంట్! ఎవరూ చూడట్లేదనుకుని.. వైరల్ వీడియో!
‘‘కార్పొరేట్ జాబ్ కారణంగా రోజులో 12 గంటలు జాబ్‌తోనే సరిపోతోంది. ఉదయాన్నే నేను 6 గంటలకు లేస్తా. 9.30కు ఆఫీసులో ఉండాలి కాబట్టి 7.30కే ఇంటి నుంచి బయలుదేరుతా. రోజంతా పనిచేసి అలసిపోయి ఇంటికొస్తా. ఇంటికి రాగానే కాస్తంత తిని నిద్రలోకి జారుకుంటా. మళ్లీ మరుసటి రోజు ఇదే పని షురూ. నా కంటూ వ్యక్తిగత జీవితం లేకుండా పోతోంది. నా మానసిక శారీరక ఆరోగ్యాలపై శ్రద్ధ పెట్టలేకపోతున్నా’’ అంటూ మహిళ నెట్టింట ఓ పోస్టు పెట్టింది (woman posting on working 12 hours a day goes viral on social media).
ఈ పోస్టుకు నెట్టింట జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కార్పొరేట్ పని సంస్కృతి కారణంగా వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య సమతౌల్యం సాధించలేకపోతున్నామని అన్నారు. ఈ కల్చర్ యువతను పీల్చిపిప్పి చేస్తోందని వాపోయారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య మహిళ పోస్టు ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.