Share News

Viral Video: పోలీస్ స్టేషన్‌కు హారతి పళ్లెంతో ఎంట్రీ.. అవమానంతో కుంగిపోయిన పోలీసులు.. అసలు కథేంటంటే..

ABN , Publish Date - Apr 14 , 2024 | 06:39 PM

ఆ మహిళ చేతిలో హారతి పళ్లెం ఉంది.. తన భర్తతో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్‌ లోపలికి వెళ్లిపోయింది.. ఎస్‌ఐ రూమ్‌లోకి వెళ్లింది.. అక్కడ అగ్గిపెట్టెతో హారతి వెలిగించింది.. ఏం జరుగుతోందో తెలియక ఎస్‌ఐ ఆశ్చర్యపోయాడు.. ఆమె మర్యాదపూర్వకంగా ఆ ఎస్‌ఐకి హారతి ఇస్తోందనుకుంటే పప్పులో కాలేసినట్టే..

Viral Video: పోలీస్ స్టేషన్‌కు హారతి పళ్లెంతో ఎంట్రీ.. అవమానంతో కుంగిపోయిన పోలీసులు.. అసలు కథేంటంటే..
పోలీస్ స్టేషన్

ఆ మహిళ చేతిలో హారతి పళ్లెం (Aarti plate) ఉంది.. తన భర్తతో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్‌ (Police station) లోపలికి వెళ్లిపోయింది.. ఎస్‌ఐ రూమ్‌లోకి వెళ్లింది.. అక్కడ అగ్గిపెట్టెతో హారతి వెలిగించింది.. ఏం జరుగుతోందో తెలియక ఎస్‌ఐ ఆశ్చర్యపోయాడు.. ఆమె మర్యాదపూర్వకంగా ఆ ఎస్‌ఐకి హారతి ఇస్తోందనుకుంటే పప్పులో కాలేసినట్టే.. పోలీసులకు (Police) తమ డ్యూటీని గుర్తు చేసేందుకే ఆ దంపతులు వినూత్న రీతిలో తమ నిరసనను ప్రదర్శించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని రేవా జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రేవా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్వాలి ప్రాంతానికి చెందిన ఆ దంపతుల షాప్‌లో నాలుగ కిలలో వెండి చోరీ జరిగింది. వెంటనే వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఇప్పటివరకు చర్య తీసుకోలేదు. దీంతో వారు పోలీసులకు వినూత్నంగా తమ నిరసన తెలియజేశారు. స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ మెడలో దండ వేసి, శాలువా కప్పి, హారతి ఇచ్చేందుకు ప్రయత్నించారు. షాకైన పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు.


ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. కొందరు ఆ జంటకు మద్దతుగా నిలిచారు. మరికొందరు పోలీసులను వెనకేసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి..

Viral: గోడలో ఏదో అలికిడి.. లోపల నుంచి బయటపడిన నిధిని చూసి షాక్.. అసలు ఏం జరిగిందంటే..


Viral Video: ఏం ఐడియా బాసూ.. రోడ్డు మీద దొరికిన వంద నోటు.. ఆశగా దానిని తీసి చూస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 14 , 2024 | 06:39 PM