Share News

Viral Video: ఆటోలో వెనుక కూర్చున్న మహిళ.. డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి షర్ట్‌ను జూమ్ చేసి చూస్తే..

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:52 PM

ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జీవిస్తున్నారు. వారందరి జీవితాలూ ఒకేలా ఉండవు. కొందరికి విలాసవంతమైన బంగ్లాలు ఉంటాయి. మరికొందరికి నివసించడానికి గుడిసె కూడా ఉండదు.

Viral Video: ఆటోలో వెనుక కూర్చున్న మహిళ.. డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి షర్ట్‌ను జూమ్ చేసి చూస్తే..

ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జీవిస్తున్నారు. వారందరి జీవితాలూ ఒకేలా ఉండవు. కొందరికి విలాసవంతమైన బంగ్లాలు ఉంటాయి. మరికొందరికి నివసించడానికి గుడిసె కూడా ఉండదు. కొందరు పూటకో డ్రెస్ (Fast Fashion) మారుస్తుంటారు. మరికొందరు నెలల తరబడి ఒకే దుస్తులు వేసుకుని అవి చిరిగిపోయినా సరే మార్చలేని దుస్థితిలో ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చాలా మందిని ఆలోచింపచేస్తోంది. miss_jugadu అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ ఆటో ఎక్కి వెనుక సీట్లో కూర్చుని ఉంది. ముందు సీట్లో డ్రైవర్ పక్కన ఓ ముసలి వ్యక్తి కూర్చున్నాడు. అతడు వేసుకున్న కుర్తా చిరిగిపోయింది. దానిని కుట్టుకుని ఆ వ్యక్తి ధరించాడు. ఆ వ్యక్తి కుర్తాను తన మొబైల్‌ ఫోన్‌తో చిత్రీకరించిన మహిళ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోతో పాటు ఆమె చేసిన కామెంట్ చాలా మందిని ఆలోచింపచేస్తోంది. తరచుగా కొత్త బట్టలు కొంటూ మనం పర్యావరణాన్ని పాడు చేస్తున్నామని, బట్టల తయారీ ద్వారా విడుదలయ్యే వేస్ట్‌ నేలకు చాలా చెడు చేస్తుందని ఆమె పేర్కొంది.

ఆ వీడియోలో కనిపించిన తాత చాలా డిగ్నిటీ కలిగిన వ్యక్తి అని, తాను డబ్బులు ఇస్తానన్నా వద్దని సున్నితంగా తిరస్కరించాడని సదరు మహిళ తెలిపింది. పాలు అమ్ముకునే ఆ వ్యక్తి వద్ద మొబైల్ కూడా లేదని పేర్కొంది. తను తీసిన వీడియోను అతడికి చూపించానని, తన మొహం కనపడనీయవద్దని అతడు కోరాడని ఆ మహిళ తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా వీక్షించారు. 21 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీరు నిజంగా తెలివైన వాళ్లు అయితే.. ఈ ఫొటోలో తప్పేంటో 3 సెకెన్లలో కనిపెట్టండి..!

Viral Video: కొబ్బరికాయను తల మీద కొట్టుకున్నాడు.. తర్వాత ఏం జరిగిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

Updated Date - Apr 03 , 2024 | 12:52 PM