Share News

Viral: పని చేయకున్నా 20 ఏళ్ల పాటు శాలరీ! అవమాన భారంతో కంపెనీపై ఉద్యోగి కేసు

ABN , Publish Date - Jun 22 , 2024 | 08:16 PM

కాలుకదపకుండా డబ్బులు రావాలని కోరుకునే వాళ్లు ఉన్నట్టే పని చేస్తేనే డబ్బు తిసుకుంటామనే ఆత్మాభిమానం గలవారు కూడా ఉంటారు. అలాంటి ఓ ఫ్రెంచ్ మహిళ తన సంస్థపై కేసు వేసింది. పని చేయకపోయినా 20 ఏళ్ల పాటు శాలరీ ఇచ్చారని ఫిర్యాదు చేసింది.

Viral: పని చేయకున్నా 20 ఏళ్ల పాటు శాలరీ! అవమాన భారంతో కంపెనీపై ఉద్యోగి కేసు

ఇంటర్నెట్ డెస్క్: కాలుకదపకుండా డబ్బులు రావాలని కోరుకునే వాళ్లు ఉన్నట్టే పని చేస్తేనే డబ్బు తిసుకుంటామనే ఆత్మాభిమానం గలవారు కూడా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉదంతం అలాంటిదే. పని చేయకుండానే తనకు ఏళ్ల పాటు జీతం ఇచ్చిన సంస్థను ఓ మహిళా ఉద్యోగి కోర్టుకు ఈడ్చింది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

Viral : ఏడేళ్లుగా సహజీవనం! ఓ బిడ్డకు తల్లయ్యాక.. బాయ్‌ఫ్రెండ్ మోసం తెలిసి..

ఫ్రాన్స్‌కు చెందిన లారెన్స్ వాన్ వెస్సెన్హోవ్‌ 1993 వరకూ ఫ్రాన్స్ టెలికాం సంస్థలో పని చేసేది. అప్పట్లో ఆమెకు మూర్ఛ వ్యాధి వచ్చింది. శరీరంలో సగ భాగం చచ్చుబడిపోయింది. దీంతో, సంస్థ ఆమెకు ఆరోగ్యానికి అనుగూణమైన బాధ్యతలు అప్పగించింది. అయితే, 2002లో ఆ సంస్థను ఆరెంజ్ అనే మరో సంస్థ టేకోవర్ చేసింది. లారెన్స్ ఆరోగ్యం దృష్ట్యా కొత్త యాజమాన్యం కూడా ఆమెకు అనుకూలమైన బాధ్యతలే అప్పగించింది. అనంతరం, లారెన్స్ అభ్యర్థన మేరకు మరో సెక్షన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసింది.


అప్పటి నుంచీ తనకు కొత్త సమస్య మొదలైందని లారెన్స్ చెప్పుకొచ్చింది. తనకు అప్పగించిన కొత్త బాధ్యతలు ఆమెకు నచ్చలేదు. మరోవైపు, సంస్థ మాత్రం ఆమెకు ఠంచనుగా శాలరీ ఇచ్చేది. లారెన్స్ ఇంటికే పరిమితమైనా కూడా శాలరీ మాత్రం అందుతూనే ఉంది. ఇలా 20 ఏళ్లు గడిచిపోవడంతో ఆమె తాజాగా కోర్టును ఆశ్రయించింది (Woman Sues Company For Paying Full Salary Without Work For 20 Years It Is Very Hard To Bear).

తనకు పని చెప్పకుండా జీతం ఇవ్వడమంటే సంస్థకు దూరం చేసే ప్రయత్నం చేయడమేనని ఆమె ఆరోపించింది. తాను గతంలోనే ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తి ప్రయత్నించాడని, కానీ ఆశించిన పురోగతి మాత్రం రాలేదని చెప్పుకొచ్చింది. ఉద్యోగం అంటే సమాజం పురోభివృద్ధిలో శక్తి మేరకు పాలుపంచుకోవడమని ఆమె వ్యాఖ్యానించింది. తనకు పనులేవీ అప్పగించకపోవడం ఓరకమైన వివక్ష అని అభిప్రాయపడింది. సంస్థ మాత్రం లారెన్స్ వాదనతో విభేదించింది. ఆమెకు తగిన ప్రత్యామ్నాయం చూపే ప్రయత్నం చేశామని, అయితే, లారెన్స్ తన అనారోగ్యం కారణంగా విధులకు తరచూ గైర్హాజరయ్యేదని తెలిపారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 22 , 2024 | 09:25 PM