Share News

Viral Video: వీడు భర్త కాదు.. రాక్షసుడు.. చికెన్ కూరలో మసాలా తక్కువైందని భార్యను కిటికీ నుంచి తోసేశాడు!

ABN , Publish Date - Apr 01 , 2024 | 02:16 PM

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఓ ఘోరం చోటు చేసుకుంది. భర్త, అత్తమామల రాక్షసత్వానికి ఓ మహిళ దారుణ అనుభవాన్ని చవి చూసింది.

Viral Video: వీడు భర్త కాదు.. రాక్షసుడు.. చికెన్ కూరలో మసాలా తక్కువైందని భార్యను కిటికీ నుంచి తోసేశాడు!

సమాజం, నాగరితక ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్ని చోట్ల మహిళలు వేధింపులు (Harassment) ఎదుర్కొంటూనే ఉన్నారు. భర్త, అత్తమామల పైశాచికత్వాన్ని భరిస్తూ కష్టాలు పడుతున్నారు. తాజాగా పాకిస్థాన్‌ (Pakistan)లోని లాహోర్‌లో ఓ ఘోరం చోటు చేసుకుంది. భర్త, అత్తమామల రాక్షసత్వానికి ఓ మహిళ దారుణ అనుభవాన్ని చవి చూసింది. చికెన్‌లో (Chicken) మసాలా ఎక్కువ వెయ్యలేదని చెప్పి మహిళను భర్త (Husband) కొట్టి, మొదటి అంతస్థు నుంచి కిందకు తోసేశాడు (Viral Video).

ఆ మహిళ కింద పడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యాయి. లాహోర్‌లోని నోనారియన్ చౌక్‌లోని షాలిమార్ రోడ్ సమీప ప్రాంతానికి చెందిన మరియమ్‌ను బాధిత మహిళగా గుర్తించారు. మార్చి నెలలో ఈ ఘటన జరిగింది. చికెన్‌లో మసాలా తగినంత వేయలేదని భర్త, అత్తమామలు ఆ మహిళపై కేకలు వేశారు. ఆమెను కొట్టి మొదటి అంతస్థు నుంచి కిందకు తోసేశారు. ఆమె రోడ్డుపై పడి బాధతో కేకలు వేసింది. స్థానికులు ఆమెను కాపాడేందుకు వచ్చారు. ఈ ఘటనలో ఆమె కాలికి గాయమైనట్టు సమాచారం.

పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడితో పాటు కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``ఇప్పటికీ ఇలాంటి దారుణమైన వాళ్లు ఉన్నారా``, ``ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష వేస్తారా``, ``స్త్రీలను హింసించే హక్కు ఎవరు ఇచ్చారు``, ``ఒకరికి కఠినమైన శిక్ష విధిస్తే మిగిలిన వారు దారిలోకి వస్తారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు!.. ఈ ఫొటోలోని పాముని 7 సెకెన్లలో కనిపెట్టండి..!


MS Dhoni: విశాఖలో ధోనీ విధ్వంసం.. సింగిల్ హ్యాండ్‌తో సిక్స్ ఎలా కొట్టాడో చూడండి..!


Updated Date - Apr 01 , 2024 | 02:16 PM