Share News

Viral Video: వావ్.. ఆ ఆంటీ తెలివితేటలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. గిన్నెలు తోమేందుకు సూపర్ టెక్నిక్..

ABN , Publish Date - Oct 15 , 2024 | 09:34 AM

సామాన్య వ్యక్తులు, గృహిణులు కూడా తమ బుర్రలకు పదును పెట్టి కష్టసాధ్యమైన పనులను సులభంగా చేసేస్తున్నాన్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యపరిచేవిగా ఉంటే, మరికొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉంటున్నాయి.

Viral Video: వావ్.. ఆ ఆంటీ తెలివితేటలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. గిన్నెలు తోమేందుకు సూపర్ టెక్నిక్..
woman used a great Jugaad to wash utensils

అబ్బురపరిచే తెలివితేటల విషయంలో మన దేశవాసులకు పోటీ వచ్చే వారు ఎవ్వరూ ఉండరేమో. సామాన్య వ్యక్తులు, గృహిణులు కూడా తమ బుర్రలకు పదును పెట్టి కష్టసాధ్యమైన పనులను సులభంగా చేసేస్తున్నాన్నారు. అలాంటి ఎన్నో వీడియోలు (Jugaad Videos) ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యపరిచేవిగా ఉంటే, మరికొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉంటున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలోని మహిళ గిన్నెలు (Utensils) కడిగేందుకు సూపర్ టెక్నిక్ ఉపయోగించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


kavita_mum అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన ఇంటి ఆవరణలో కూర్చుని పాత్రలు కడుగుతోంది. అయితే అస్తమానూ పైప్ పట్టుకునే అవసరం లేకుండా ఓ ప్లాన్ వేసింది. నీళ్లు వస్తున్న ఆ పైప్‌ను తన తలపై కట్టుకుంది. ఆ పైప్ నుంచి నీళ్లు నేరుగా గిన్నెల మీద పడుతుండడంతో వాటిని సులభంగా కడిగేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పాత్రలను కడిగేందుకు ఉపయోగపడే ఈ ప్రత్యేకమైన ట్రిక్‌ను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆ వీడియో రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ దక్కించుకుంది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మంది వీక్షించారు. 16 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మాస్టర్ పీస్ ఆఫ్ జుగాడ్``, ``ఈ సంవత్సరంలో ఉత్తమ మహిళ``, ``ఇలా కడగితే చాలా నీళ్లు వృథా అయిపోతాయి``, ``ఇది పనికిరాని జుగాడ్``, ``ఆంటీకి అవార్డు ఇవ్వాలి``, ``మెదడు మోకాలులో ఉండడం అంటే ఇదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 09:34 AM