Share News

Viral Video: వేగంగా వస్తున్న రైలు ముందు యువతి రీల్.. డ్రైవర్ ఆమెను ఎలా కాపాడాడో చూడండి..

ABN , Publish Date - Jul 02 , 2024 | 10:13 AM

ప్రస్తుత డిజిటిల్ యుగంలో సోషల్ మీడియా పాపులారిటీ అనేది చాలా క్రేజ్‌గా మారిపోయింది. విభిన్నంగా ఆలోచించి రీల్స్ రూపొందించి చాలా మంది పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. దీంతో చాలా మంది అదే బాటలో పయనిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అనవసర సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Viral Video: వేగంగా వస్తున్న రైలు ముందు యువతి రీల్.. డ్రైవర్ ఆమెను ఎలా కాపాడాడో చూడండి..
Woman making reel in front of moving train

ప్రస్తుత డిజిటిల్ యుగంలో సోషల్ మీడియా పాపులారిటీ అనేది చాలా క్రేజ్‌గా మారిపోయింది. విభిన్నంగా ఆలోచించి రీల్స్ (Reels) రూపొందించి చాలా మంది పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. దీంతో చాలా మంది అదే బాటలో పయనిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అనవసర సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎక్కడ వీడియోలు, సెల్ఫీలు తీసుకోవాలో అనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిసున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది (Viral Video).


uniladtech అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ రైలు (Train) వేగంగా వస్తుంది. రైల్ ట్రాక్‌ (Railway Track)కు దగ్గర్లో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఓ మహిళ రైలు వస్తున్న ట్రాక్‌కు దగ్గరగా నిలబడి ఉండగా, ఓ వ్యక్తి ఆమెను వీడియో తీస్తున్నాడు. వారి చేష్టలను దూరం నుంచి చూసిన లోకో పైలెట్ (Train Driver) అప్రమత్తం అయ్యాడు. ఇంజిన్ డోర్ దగ్గర నిలబడి ఆమెను కాలితో పక్కకు తోశాడు. లేకపోతే ఆ రైలు ఆమెను కచ్చితంగా ఢీకొట్టేది. ఆమె గాయాలపాలయ్యేది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. 1.3 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇంకొంచెం గట్టిగా తన్ని ఉంటే బాగుండేది``, ``వీడియో తీస్తున్న వ్యక్తి అయినా ఆమెను హెచ్చరించాలి కదా``, ``ఇది తీవ్ర నిర్లక్ష్క్ష్యం. ఆ ఇంజిన్ డ్రైవర్ లేకపోతే ఆమె తీవ్ర ప్రమాదానికి గురయ్యేది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇది చాలా గొప్ప ట్యాలెంట్.. ఇంత స్పీడ్‌గా రివర్స్ చేయగల కెపాసిటీ ఎవరికీ ఉండదు..!


Optical Illusion: ఈ ఫ్లెమ్మింగోల మధ్య ఉన్న హార్ట్ సింబల్‌‌ను కనిపెడితే మీ కళ్లకు తిరుగులేదు..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 02 , 2024 | 10:13 AM