Share News

Costly Rice: ఛాలెంజ్.. ఈ బియ్యం కొనాలంటే మీ ఆస్తులు అమ్మాల్సిందే

ABN , Publish Date - Sep 19 , 2024 | 09:33 PM

సాధారణంగా కిలో బియ్యం ధరెంత పలుకుతాయి. సన్నాలైన, బాస్మతీ అయినా కిలో రూ.100కి మించి ఉండవు.. కదా. మరికొన్ని రకాలు రూ.100కుపైనే ఉండొచ్చు. కానీ.. కిలో వేల రూపాయలు పలికే బియ్యం గురించి మీరెప్పుడైనా విన్నారా.

Costly Rice: ఛాలెంజ్.. ఈ బియ్యం కొనాలంటే మీ ఆస్తులు అమ్మాల్సిందే

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా కిలో బియ్యం ధరెంత పలుకుతాయి. సన్నాలైన, బాస్మతీ అయినా కిలో రూ.100కి మించి ఉండవు.. కదా. మరికొన్ని రకాలు రూ.100కుపైనే ఉండొచ్చు. కానీ.. కిలో వేల రూపాయలు పలికే బియ్యం గురించి మీరెప్పుడైనా విన్నారా. అవును.. ఓ రకం బియ్యం కిలో ధరెంతో తెలుసా. అక్షరాలా రూ.15 వేలు.. షాక్ కాకండి. మీరు విన్నది నిజమే. ఆ వెరైటీ బియ్యం విశేషాలేంటో తెలుసుకుందాం.

జపనీస్ కిన్మెమై రైస్ ను ప్రీమియం రైస్ అని కూడా పిలుస్తారు. దీని విలక్షణమైన ప్రొడ్యూసింగ్ టెక్నాలజీ.. రుచి, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కిన్మెమై పద్ధతిని ఉపయోగించి రూపొందించబడిన ఈ బియ్యం.. అహార ప్రియులు, ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వ్యక్తులు ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత నోరిన్స్.. అంటే వంట చేయడానికి ముందు ఈ బియ్యాన్ని కడగనవసరం లేదు. కిన్మెమై వైట్ రైస్ వేరియంట్ సాధారణ వైట్ రైస్‌లాగే ఉంటుంది. త్వరగా వండొచ్చు కూడా. ఈ బియ్యాన్ని జపాన్ ప్రజలు పండిస్తున్నారు. ఇవి పేటెంట్ కూడా పొందాయి.


అనేక లాభాలు..

కిన్మెమై వైట్ అండ్ బ్రౌన్ రైస్ రెండూ సున్నితమైన పాలిషింగ్ ప్రక్రియ ద్వారా శరీరానికి చాలా లాభాలు అందిస్తాయి. కిన్మెమై రైస్ బెటర్ వైట్ సాధారణ బియ్యం కంటే 1.8 రెట్లు ఎక్కువ ఫైబర్, ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ B1 కలిగి ఉంటుంది. ఆరు రెట్లు ఎక్కువ లిపోపాలిసాకరైడ్లు ఇందులో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కిలో రూ.15 వేలు పలుకుతూ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా ఇవి రికార్డు నెలకొల్పాయి. జపాన్ వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది.

Also Read:

రైతుల పోరుబాటతో కాంగ్రెస్ వెన్నులో వణుకు..

పిల్లలను నలుగురిలో తిడితే జరిగేది ఇదే..

తిరుమల లడ్డూపై సీఎం చెప్పినవన్నీ నిజాలే...

For MoreNational NewsandTelugu News

Updated Date - Sep 19 , 2024 | 09:34 PM