Share News

Viral Video: వావ్.. 70 ఏళ్ల వయసులో అంత సాహసమా? గొర్రె పదే పదే కొమ్ములతో పొడుస్తుంటే.. ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Dec 26 , 2024 | 04:31 PM

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మారుమూల ప్రాంతాల విషయాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అక్కడి వ్యక్తుల ప్రతిభ, గ్రామాల్లోని సాంప్రదాయాలు, నమ్మకాల గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌ లోని అజంగఢ్‌కు చెందిన ఓ దేశవాళీ ఆట గురించి ఎవరికీ తెలియదు.

Viral Video: వావ్.. 70 ఏళ్ల వయసులో అంత సాహసమా? గొర్రె పదే పదే కొమ్ములతో పొడుస్తుంటే.. ఏం జరిగిందో చూడండి..
Strange game with Sheep

పట్టణాలకు దూరంగా ఎక్కడో విసిరేసినట్టుండే గ్రామాల్లో జరిగే చాలా వింత సంఘటనల గురించి ప్రపంచానికి తెలియదు. అయితే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మారుమూల ప్రాంతాల విషయాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అక్కడి వ్యక్తుల ప్రతిభ, గ్రామాల్లోని సాంప్రదాయాలు, నమ్మకాల గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లోని అజంగఢ్‌కు చెందిన ఓ దేశవాళీ ఆట గురించి ఎవరికీ తెలియదు. ఆ ఆట తాజాగా బయటకు వచ్చింది. ఆ వీడియోలో 70 ఏళ్ల వృద్ధుడు (Old Man) గొర్రె (Sheep)తో పోటీపడుతున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


ప్రతీక్ యాదవ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. 70 ఏళ్ల ఓ వృద్ధుడు ఓ ఆటలో గొర్రెతో పోటీపడుతున్నాడు. 70 ఏళ్ల ఆ వృద్ధుడు ఎర్రటి లంగోటీ ధరించి నేలపై కూర్చున్నాడు. నల్లటి గొర్రె ఒకటి అతడిని పొడుస్తోంది. నేలపై కూర్చున్న ఆ వ్యక్తి తన భుజాలను చూపిస్తూ గొర్రెను రెచ్చగొడుతున్నాడు. గొర్రె పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని వేగంగా పొడిస్తే.. అతడు దూరంగా వెళ్లి పడుతున్నాడు. అయినా ఆ వృద్ధుడు, గొర్రెను మళ్లీ మళ్లీ కొట్టమని అడుగుతున్నారు. ఈ భయానక ఆటను చూడటానికి ప్రేక్షకులు చుట్టూ గుమిగూడారు.


ఈ ఆటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``70 ఏళ్ల వయసులో అంత ఫిట్‌నెస్ చాలా గొప్ప విషయం``, ``70 ఏళ్ల వయసులో మంచం మీద నుంచి లేవడం కూడా కష్టం``, ``అతడిది స్టీల్ బాడీ అయ్యుంటుంది``, ``ఆ వ్యక్తి యవ్వనంలో ఉండేటపుడు ఏం చేసేవాడో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral News: ఉల్లిపాయ అడిగిన డెలివరీ బాయ్.. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే..


Viral Video: ఈ అమ్మాయికి ఏమైంది? బిజీ రోడ్డు మీద బైక్ అలా నడుపుతోందేంటి.. వీడియో వైరల్..


Viral Video: ఇది ఆల్టో కాదు.. మినీ థార్.. ఓ వ్యక్తి ఇంజినీరింగ్ ప్రతిభ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


Picture Puzzle Test: ఈ ఫొటోలో తప్పేంటో 5 సెకెన్లలో కనిపెడితే.. మీ అబ్జర్వేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Viral Video: ఇది మామూలు ప్రాంక్ కాదు.. స్నేహితుడిని నమ్మినందుకు ఎలా మోసం చేశాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 26 , 2024 | 05:06 PM