Share News

Viral Video: గుంతల రోడ్లపై యమధర్మరాజు, చిత్రగుప్తుడు.. దెయ్యాలతో లాంగ్ జంప్.. ఫన్నీ వీడియో వైరల్!

ABN , Publish Date - Aug 28 , 2024 | 08:37 PM

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు చాలా వరకు పాడైపోయాయి. నాణ్యత లేని నాసిరకం పనితీరు కారణంగా ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనం ఇస్తున్నాయి. ఈ రోడ్ల మీద ప్రయాణం వాహనదారులకు, పాదచారులకు పెద్ద సమస్యగా మారుతోంది.

Viral Video: గుంతల రోడ్లపై యమధర్మరాజు, చిత్రగుప్తుడు.. దెయ్యాలతో లాంగ్ జంప్.. ఫన్నీ వీడియో వైరల్!
Yamraj and Chitragupta long jump competition on pothole-filled road

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు (Roads) చాలా వరకు పాడైపోయాయి. నాణ్యత లేని నాసిరకం పనితీరు కారణంగా ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనం ఇస్తున్నాయి. ఈ రోడ్ల మీద ప్రయాణం వాహనదారులకు, పాదచారులకు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ సమస్య మరింత ఎక్కువవుతోంది. గుంతలు అన్నీ నీటితో నిండిపోయి పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ సమస్యపై ఫన్నీగా నిరసన తెలుపుతూ రూపొందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు నవ్వుకుంటున్నారు (Viral Video).


కృష్ణాష్టమి సందర్భంగా కర్ణాటకలోని పుణ్యక్షేత్రమైన ఉడుపి (Udupi)లో భారీ ఉత్సవాలు నిర్వహించారు. ఆ నగరంలోని రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. వర్షపు నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కొందరు వ్యక్తులు వెరైటీగా ప్రయత్నించారు. యమధర్మరాజు (Yamraj), చిత్రగుప్తుడి (Chitragupta) వేషాలు వేసి దెయ్యాల వేషధారణలో ఉన్న వారికి లాంగ్ జంప్ పోటీలు (Long jump competition) పెట్టారు. @bykarthikreddy అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో పాటు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 9 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 16 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఫన్నీ వీడియో ద్వారా సమస్యను అద్భుతంగా వివరించారు``, ``ఈ వీడియో చూసిన తర్వాతైనా అధికారుల్లో స్పందన వస్తుందేమో చూడాలి``, ``ఈ సమస్య ఎప్పటికీ శాశ్వతంగా పరిష్కారం కాదు``, ``అద్భుతమైన ఆలోచన`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: చదవడానికి టైమ్ లేదు.. అలా చేయాలంటూ పరీక్షలో ఓ చిన్నారి విజ్ఞప్తి.. ఏం రాశాడో చూస్తే నవ్వకుండా ఉండలేం..


Viral Video: పోలీసులా? మజాకానా? ఇద్దరు కుర్రాళ్లకు ఉదయాన్నే జైపూర్ పోలీసులు ఇచ్చిన సర్‌ప్రైజ్ ఏంటంటే..


Viral Video: కేవలం రూ.50కే పలు వెరైటీలతో లంచ్.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఏంటంటే..


Viral Video: ఇదేం పని నాగరాజా.. బెడ్రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చుట్టుకున్న నాగుపాము.. ఫ్యాన్ వేస్తే..


Optical Illusion: మీ కళ్లకు, బ్రెయిన్‌కు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో దాక్కున్న మరో నలుగురిని కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2024 | 08:37 PM