Share News

Viral: ``మీరు చాలా హాట్, క్యూట్``.. హెచ్‌ఆర్‌కు రిజెక్టెడ్ అభ్యర్థుల మెసేజ్‌లు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉద్యోగిని..

ABN , Publish Date - Oct 30 , 2024 | 09:42 PM

ఏదైనా ఉద్యోగానికి వెళ్లి రిజెక్ట్ అయితే నిరాశ పడడంలో తప్పు లేదు. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుని తర్వాతి ఇంటర్వ్యూ కోసం సన్నద్ధం కావాలి. అంతే తప్ప రిజెక్ట్ చేసిన సంస్థ ఉద్యోగులపై కోపం పెంచుకోవడం తగని పని. అలా చేస్తే ఎప్పటికీ మంచి ఉద్యోగం సాధించలేం.

Viral: ``మీరు చాలా హాట్, క్యూట్``.. హెచ్‌ఆర్‌కు రిజెక్టెడ్ అభ్యర్థుల మెసేజ్‌లు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉద్యోగిని..
HR executive receives disturbing messages from rejected job candidates

ఏదైనా ఉద్యోగానికి (Job) వెళ్లి రిజెక్ట్ అయితే నిరాశ పడడంలో తప్పు లేదు. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుని తర్వాతి ఇంటర్వ్యూ (Interview) కోసం సన్నద్ధం కావాలి. అంతే తప్ప రిజెక్ట్ చేసిన సంస్థ ఉద్యోగులపై కోపం పెంచుకోవడం తగని పని. అలా చేస్తే ఎప్పటికీ మంచి ఉద్యోగం సాధించలేం. అంతేకాకుండా ఏమైనా తేడా జరిగితే ఉద్యోగ జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది. తాజాగా నోయిడా (Noida)లో ఇలాంటి ఘటనే జరిగింది. నోయిడాలో ఓ సంస్థలో హెచ్‌ఆర్ విభాగంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగినికి తిరస్కరణలకు గురైన అభ్యర్థుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి (Noida HR).


ఓ వ్యక్తి నోయిడాకు చెందిన సంస్థలో ఇంటర్వ్యూకు హాజరై రిజెక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూ చేసిన హెచ్‌ఆర్ వాట్సాప్ నెంబర్‌కు ``మీరు చాలా అందంగా ఉన్నారు`` అంటూ మెసేజ్ చేశాడు. ఆ తర్వాత ``నిన్ను మర్చిపోలేకపోతున్నా``, ``నీవు లేకుండా బతకలేను`` అనే స్థాయికి చేరుకున్నాడు. ఆ మెసేజ్‌లను చూసిన సదరు ఉద్యోగిని రిప్లై ఇవ్వలేదు. దీంతో అతడు మరింత శ్రుతి మించి మెసేజ్‌లు చేయడం మొదలుపెట్టాడు. మరో వ్యక్తి కూడా అలాగే చేశాడు. ``ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు మరో అవకాశం ఇస్తారా`` అని మొదలు పెట్టి దారి మార్చాడు. ``మీరు చాలా హాట్``, ``నాకు నిద్రపట్టడం లేదు`` అంటూ మెసేజ్‌లు పెట్టాడు.


ఆ మెసేజ్‌లకు కూడా ఆ మహిళా ఉద్యోగిని రిప్లై ఇవ్వలేదు. చివరకు వారు శ్రుతి మించడంతో వారు పంపిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్‌లతో సహా లింక్డిన్‌లో పోస్ట్ చేసింది. వారి ఫోన్ నెంబర్లను కూడా బయటపెట్టింది. తన మౌనాన్ని వారు అలుసుగా తీసుకున్నారని, వారు ఉద్యోగులగానే కాదు, మనుషులగా కూడా విఫలమయ్యారని పేర్కొంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమ స్పందనలు తెలియజేశారు. ``పర్సనల్ నెంబర్లను అపరిచితులకు ఇవ్వకూడదు``, ``తొలి మెసేజ్ వచ్చినప్పుడే వారిని బ్లాక్ చెయ్యాల్సింది`` అంటూ కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ వ్యక్తి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. రెండు బైక్‌లతో తయారు చేసిన వెరైటీ వాహనాన్ని చూడండి..


Viral Video: పిచ్చికి కూడా ఓ హద్దుంటుంది భయ్యా.. ఈ డ్రెస్ చూసి ఉర్ఫీ జావేద్ కూడా భయపడుతుందేమో..


Viral Video: వామ్మో.. వాహనాలు గాల్లోకి ఎలా ఎగురుతున్నాయో చూడండి.. కారణం ఏంటో తెలిస్తే..

Spain: స్పెయిన్‌లో వరద విలయం.. పట్టాలు తప్పిన హైస్పీడ్ రైలు.. వందలాది కార్లు ఏమయ్యాయంటే..


Viral Video: ఏమైనా తేడా వస్తే సరదా తీరిపోతుంది.. పాకిస్తాన్ విద్యార్థులు రీల్స్ కోసం ఏం చేస్తున్నారో చూడండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 30 , 2024 | 09:42 PM