Viral: 10 సెకెన్లలో 3 దేశాలను చూసెయ్యొచ్చు.. ఆ నగరం ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
ABN , Publish Date - Aug 09 , 2024 | 04:36 PM
ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటిది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లాలంటే గంటల కొద్ది సమయం ప్రయాణంలో గడపాల్సిందే. అయితే ఈ భూమి అత్యంత అరుదైన ప్రదేశం ఒకటి ఉంది. అక్కడికి వెళ్తే కేవలం 10 సెకెన్లలో మూడు దేశాలను చూడవచ్చు.
ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళ్లాలంటే చాలా సమయం (Time) పడుతుంది. అలాంటిది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లాలంటే గంటల కొద్ది సమయం ప్రయాణంలో గడపాల్సిందే. అయితే ఈ భూమి అత్యంత అరుదైన ప్రదేశం ఒకటి ఉంది. అక్కడికి వెళ్తే కేవలం 10 సెకెన్లలో మూడు దేశాలను చూడవచ్చు. ఆ నగరం పేరు బాసెల్ (Basel). యూరప్ (Europe)లో ఆ నగరం ఉంది. స్విట్టర్లాండ్‌కు చెందిన ఈ నగరం మూడు దేశాల సరిహద్దుల నడుమ ఉంది. ఆ నగరం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే (Viral News).
ఈ బాసెల్ నగరాన్ని ``వెల్ ప్లేస్డ్ వండర్`` అని పిలుస్తారు. ఈ నగరం ఒకేసారి మూడు వేర్వేరు ప్రదేశాల సరిహద్దులను దాటిన అనుభవాన్ని ఇస్తుంది. స్విట్జర్లాండ్ (Switzerland)లో ఉన్న ఈ నగరం ఫ్రాన్స్ (France), జర్మనీ (Germany)లలో కూడా విస్తరించి ఉంది. ఈ నగరంలో స్విస్ సంస్కృతి ఎక్కువగా కనబడుతుంది. ఈ నగరంలోని రాతి కట్టడాలు, ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే కార్నివాల్ చాలా ప్రత్యేకం. ఈ కార్నివాల్‌లో మూడు దేశాల ప్రజలు పాల్గొంటారు. ఈ నగరానికి మరో వరం రైన్ నది.
మూడు దేశాల సరిహద్దుల్లో ఉండే ఈ నగరంలో రైన్ నది మీద ప్రయాణం గొప్ప అనుభూతిని కలిగిస్తుందట. ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎమ్‌ఎస్ బడ్జెట్ ఈ నగరం విషయాలను వెల్లడించారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు స్థానికులు కేవలం వాటర్ ప్రూఫ్ బ్యాగ్‌లు ధరించి నదిలో నడుచుకుంటూ వెళ్లిపోతారట. చాలా తక్కువ బడ్జెట్‌తోనే ఈ నగరంలో తన పర్యటన జరిగినట్టు ఎమ్‌ఎస్ వివరించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ వీడియో చూస్తే దడుచుకోవాల్సిందే.. తనను తానే తినేస్తున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి